థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘నేనో రకం’

SaiRam Shankar Thrilling Entertainer Nenorakam releasing on March17th

SaiRam Shankar Thrilling Entertainer Nenorakam releasing on March17th

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. చిత్రీకరణ పూర్తి చేసుకొని మార్చి 17న సినిమా విడుదలకు సిద్దమవుతోంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహిత్ నారాయణ్ కంపోజ్  చేసిన ఈ సినిమా పాటలను  పూరి జగన్నాథ్,దేవిశ్రీ ప్రసాద్,  గోపిచంద్ ,శర్వానంద్  ఒక్కొక్కరిగా ఒక్కొక్క పాటను  త్వరలో ఆవిష్కరించబోతున్నారు.

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ.. నేనో రకం అనే టైటిల్ మా ఈ  సినిమాకు కరెక్ట్ గా యాప్ట్. ఆడియెన్స్ ను అలరించటంతొ పాటు , ఆలొచింపచెసెలా ,కాంటెపరరీ ఇష్యూస్ ను స్పూర్తిగా తీసుకొని , ఇంట్రెస్టింగ్ కంటెంట్తో  థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కించబడిన చిత్రమిదన్నారు.

శరత్ కుమార్ మాట్లాడుతూ..గత కొంత కాలంగా  సౌత్ లో అందులోనూ తెలుగు సినీ పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి.నేనోరకం  సైతం అదే కొవలో వస్తున్న ట్రెండీ మూవీ.  దర్శకుడి కధ, కధనమే ఈ సినిమాకు హైలెట్. సినిమా టీమ్ అందరికి ఈ సినిమా మంచి పేరును తీసుకు వస్తుందన్నారు..

దర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ. మహిత్ అందించిన పాటలను  టాప్ సెలబ్రెటీస్  త్వరలో ఆవిష్కరించబోతున్నారు.  “నేనోరకం” టైటిల్ కు తగ్గట్టుగానే  సరికొత్త ట్రీట్ మెంట్ తో సినిమా రూపొందించటం జరిగింది.  సాయిరామ్ శంకర్  -శరత్ కుమార్ ల నటన ,వారిద్దరి మధ్య వచ్చె సన్నివేశాలు ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ను కలుగచేస్తాయన్నారు.

నిర్మాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ…  మా సంస్థ ద్వారా వస్తొన్న తొలి చిత్రన్నె  ఓ సరికొత్త కమర్షియల్ మూవీగా  ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. ఆడియోన్స్ తో పాటు, క్రిటిక్స్ ను కూడా  అలరించెలా ఈ సినిమాను  సిద్దం చేయటం జరిగింది. మార్చి 17న సినిమా విడుదలవుతుందన్నారు.

రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో  ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్  తదితరులు నటిస్తున్నారు
కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్

Have something to add? Share it in the comments

Your email address will not be published.