గోవాలో చైతూ సమంతల పెళ్ళి

Samantha and Chaitu to tie the knot on October 6 in Goa

Samantha and Chaitu to tie the knot on October 6 in Goa

టాలీవుడ్‌లో ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న మ్యారేజ్ డేట్ ఫిక్సైంది. లవ్‌బర్డ్స్‌ ఏకమవడానికి ముహూర్తం సిద్ధమవడంతో ఇప్పుడు అందరి దృష్టి వాళ్ళపైనే ఉంది. ఏం మాయ చేసావే సినిమాలో  కలిసి నటించి తర్వాత ప్రేమలో పడి, పెద్దలను ఒప్పించి పెళ్ళికి సిద్ధపడ్డ అక్కినేని నాగ చైతన్య, సమంతల వివాహ ముహూర్తం సిద్ధమైపోయింది. ఈ యేడాది అక్టోబర్ 6తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది.

తాజాగా సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ కి హాజ‌రైన చైతూ త‌న మ్యారేజ్ డేట్ అక్టోబ‌ర్ 6 అని అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించినట్టు ఫిలింఫేర్‌ అవార్డ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. అక్టోబర్‌ 6 ఈజ్‌ బిగ్‌ డేట్‌ అని ట్వీట్‌ చేసింది. అంతేకాదు  మంచి రొమాంటిక్‌ ఫిలిం  లభిస్తే.. సమంతతో కలిసి పనిచేయడం తనకు సంతోషమేనని ప్రకటించాడు చైతూ. ఇప్పటికే  హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేసుకున్న చైతూ, సామ్‌లు ఇద్దరూ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రారండోయ్‌ వేడుక చూద్దాం సినిమా సక్సెస్ తర్వాత చైతూ కూడా ఇతర సినిమాల్లో హడావిడిగా ఉన్నాడు. మరోవైపు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్న సమంత హైద్రాబాద్, చెన్నైల మధ్య చక్కర్లు కొడుతున్నారు.

ఇప్పటికే నాగార్జున కూడా తన కోడలు సమంత గురించి టాలీవుడ్ సందర్భం దొరికినప్పుడల్లా తెగ మెచ్చేసుకుంటూ మురిసిపోతున్నారు.  నిజానికి అక్టోబర్ నెలలో బ్యాంకాక్‌లోనో బాలి ఐల్యాండ్‌లోనో సమంత- చైతూల పెళ్ళి అని మొన్నటివరకు రూమర్లు వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో కొత్త కబురు వినిపిస్తుంది. అక్టోబర్ 6న డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లాగా గోవాలో వీళ్ళ మెగా వెడ్డింగ్‌కు ఏర్పాట్లు మొదలయ్యాయని టాక్. ఇప్పటి వరకు దీనికి సంబంధించి అఫీషియల్‌గా ఎలాంటి సమాచారం బయటికి రానప్పటికీ పనులు మాత్రం మొదలయ్యాయి.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.