చైతూతో నా పెళ్ళి ఎప్పుడో అయిపోయింది: సమంత

Samantha interacts with follwers on twitter about marriage and career

టాలీవుడ్‌లో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న పెళ్ళి ఏదైనా ఉందంటే అది నాగ చైతన్య, సమంతలదే. అక్టోబర్ 6న గోవాలో మూడు రోజులపాటు జరుగబోయే పెళ్ళికి అంతా రెడీ అయిపోతుంటే సమంత మాత్రం తమ ఇద్దరి పెళ్ళి ఎప్పుడో అయిపోయిందని ట్విట్టర్ సాక్షిగా చెప్పేసింది.

Samantha interacts with follwers on twitter about marriage and career

ట్విట్టర్లో ఫాలోవర్స్ సంఖ్య నలభై లక్షల దాటిన సందర్భంగా ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పిన సమంత చైతో తన వూహల్లో పెళ్ళి ఎప్పుడో అయిపోయిందని, చెప్పాలంటే తమకంటే అభిమానులే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పింది. ‘రంగస్థలం’ షూటింగ్‌ అద్భుతంగా జరుగుతోందని, ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం తన అదృష్టమని, సినిమా యూనిట్ అంతా తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని స్పష్టంచేసింది. చాలా క్లిష్టమైన వాతావరణంలో షూటింగ్‌ జరుగుతోందని, అయినా చెర్రీ అవేమీ పట్టించుకోకుండా చకచకా పనిచేసేస్తున్నాడని కితాబు ఇచ్చింది.

See Also: గోవాలో చైతూ సమంతల పెళ్ళి

పెళ్ళైన తర్వాత కూడా తను తనలాగానే ఉంటానని, పెళ్లైన తర్వాత కూడా ‘ప్రత్యూష’ ఫౌండేషన్‌ని నడిపిస్తానని, మిస్‌ లేదా మిసెస్‌తో మనిషిలో ఏ మార్పు రాదని చెప్పుకొచ్చింది. అఖిల్‌ చాలా సున్నితమైన వ్యక్తి అని ఫ్యాన్స్‌కు తెలియని విషయాన్ని చెప్పింది. ‘రాజుగారి గది 2’లో తన పాత్ర చాలా చిన్నదని, అయినా అద్భుతంగా ఉంటుందని తెలిపింది. పెళ్లయ్యాక కూడా చైతన్యతో తప్పకుండా సినిమా చేస్తానని స్పష్టం చేసింది. రంగస్థలం కాకుండా తాను నటించబోయే మరో రెండు చిత్రాల్లో కాజల్‌ ఉందని స్పష్టంచేసింది సమంత.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.