సందీప్ కిషన్‌కి ఇప్పుడైనా కలిసొస్తుందా?

Sandeep Kishan Regina Nagaram Ready to release on March10th

Sandeep Kishan Regina Nagaram Ready to release on March10th

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా వంటి హిట్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేక వరుస ఫ్లాపులను అందుకుంటున్న హీరో సందీప్ కిషన్. ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఈ యంగ్ హీరోని మాత్రం లక్కీ బాయ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా సక్సెస్‌తో ఏమాత్రం సంబంధంలేకుండా వరుసగా పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సందీప్ కిషన్ లేటెస్ట్ సినిమా నగరం. రెజీనా హీరోయిన్‌గా అశ్వనికుమార్‌ సహదేవ్‌ సమర్పణలో ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకాలపై లోకేష్‌ దర్శకత్వంలో రూపొందిన వెరైటీ సినిమా ‘నగరం’. ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అయ్యింది.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు అశ్వనికుమార్‌ సహదేవ్‌ మాట్లాడుతూ – ”ఒక నగరంలో 48 గంటల్లో నలుగురు వ్యక్తుల మధ్య జరిగే కథ ఇది. సందీప్‌ కిషన్‌ది ఒక స్టోరీ కాగా, రెజీనాది మరో స్టోరీ. శ్రీ అనే వ్యక్తిది ఇంకో స్టోరీ. ఈ మూడు స్టోరీలను కలుపుతూ ఒక డ్రైవర్‌ కథ వుంటుంది. ఈ నాలుగు కథలూ ప్యారలల్‌గా రన్‌ అవుతూ వుంటాయి. ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్‌ మూవీ. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా అనిపిస్తుంది.

సినిమాలో సందీప్‌ కిషన్‌, రెజీనాలపై చిత్రీకరించిన ఒక మాంటేజ్‌ సాంగ్‌ సినిమాకి పెద్ద హైలైట్‌ అవుతుంది. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలా కాకుండా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన కమర్షియల్‌ మూవీ ఇది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది. సినిమా మీద మాకు చాలా కాన్ఫిడెన్స్‌ వుంది. శుక్రవారం రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాని బుధవారమే పాత్రికేయులకు షో వేయాలనుకుంటున్నాం. సినిమా మీద మాకు అంత కాన్ఫిడెన్స్‌ వుంది. ఈ చిత్రాన్ని మార్చి 10న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. తప్పకుండా ‘నగరం’ మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.