శశికళ హత్య: మృతదేహాలు ఇండియాకు రావడంపై అనుమానాలు

Sasikala Murder: doubts about dead bodies being brought to India

Sasikala Murder: doubts about dead bodies being brought to India

విజయవాడ: న్యూజెర్సీలో హత్యకు గురైన తెలుగు టెకీ నర్రా శశికళ (36), ఆమె కుమారు అనీష్ సాయి (7) ల అంత్యక్రియలు నిర్వహించే విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. శశికళ, ఆమె కుమారుడు గత గురువారం తన ఇంట్లోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. తన అల్లుడు హనుమంత రావే తన కూతురిని, మనుమడిని హత్యచేశాడని విజయవాడలో ఉంటున్న శశికళ తల్లిదండ్రులు ఆరోపించిన నేపధ్యంలో నిందితుడిని కనుగొనేందుకు అమెరికా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికా పోలీసులు శశికళ, అనీష్ సాయి మృతదేహాలకు లాంఛనాలను పూర్తిచేసి మృతదేహాలను శశికళ భర్త హనుమంతరావుకు, తెలుగు అసోసియేషన్ ప్రతినిధులకు అప్పగించారు. శశికళ, అనీష్ సాయిల మృతదేహాలను అంత్యక్రియలు జరపడానికి విజయవాడ లో ఉన్న తన ఇంటికి పంపాలని శశికళ తల్లిదండ్రులు అమెరికా పోలీసు,  అమెరికా కాన్సులేట్ ని కోరారు. కానీ హనుమంతరావు అందుకు అంగీకరించలేదు. అంత్యక్రియలను అమెరికాలో జరుపుకుంటానని తెలిపాడు.

ఈ నేపధ్యంలో ప్రకాశం జిల్లా, పారుచెర్వు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామంలో నివశిస్తున్న హనుమంత రావు తల్లిదండ్రులు నర్రా సుబ్బారావు, శివపార్వతీలు కూడా తమ కోడలు, మనుమడి మృతదేహాలను తమ ఇంటికి పంపాలని హనుమంతరావుని కోరడంతో కొంత ఆసక్తికరంగా మారింది. అయితే పోలీసులు తాను అమెరికా విడిచి వెళ్లకూడదని ఆంక్షలు విధించిన కారణంగా మృతదేహాలను తిమ్మరాజుపాలెంకు పంపడానికి హనుమంత రావు తొలుత అంగీకరించాడు. అంత్యక్రియలకు ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంది కాబట్టి, మృతదేహాలను విజయవాడ లేదా తిమ్మరాజుపాలెం పంపాలని అడుగుతునారు కాబట్టి శశికళకు, అనీష్ సాయి మృతదేహాలకు అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహించాలని హనుమంతరావు మరో ఆలోచన చేస్తున్నాడు.

“జంట హత్యలపై అల్లుడు హనుమంతరావు, అతని స్నేహితురాలు దీపా అజిత్ పై అనేక అనుమానాలున్నాయి. ఇంతవరకు దోషులను గుర్తించకుండా, పోలీసుల దర్యాప్తు పూర్తికాకుండా కేసు ఉపసంహరించుకోవడం కుదరదని“ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. హనుమంతరావు, అతని స్నేహితురాలు దీపా అజిత్ పై అమెరికా పోలీసులు, అమెరికా కాన్సులేట్ కు శశికళ తల్లిదండ్రులు గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఏదిఏమైనప్పటికీ శశికళ తల్లిదండ్రులు అల్లుడిపై అనుమానాలు లేవన స్పష్టం చేసేవరకు అమెరికా బయటకు వెళ్లడానికి హనుమంతరావును పోలీసులు అనుమతించే అవకాశం లేదు.

ఎట్టకేలకు శశికళ, అనీష్ సాయి మృతదేహాలకు తిమ్మరాజుపాలెంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని హనుమంతరావు, అతని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. అంత్యక్రియలు నిర్వహించడానికి ముందే మృతదేహాలను విజయవాడలోని తన ఇంట్లో కొద్దిసేపు ఉంచి తర్వాత తిమ్మరాజుపాలెం తీసుకెళ్లాలని శశికళ తల్లిదండ్రులు అమెరికా కాన్సులేట్ ని కోరారు. ఈ విషయాన్ని తానా సభ్యులకి కూడా వెంకటేశ్వరరావు తెలిపారు.

ఏదిఏమైనప్పటికీ అన్నీ అనుమానాలు తొలగిపోయి మృతదేహాలను ఇండియాకు తరలించడానికి అమెరికా పోలీసుల నుంచి ఎప్పటిలోగా అనుమతి లభిస్తుందో వేచి చూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.