శశికళ హత్య: హనుమంత రావు, దీపాను ప్రశ్నించిన పోలీసులు

Sasikala Murder: Police question Hanumantha Rao, deepa jit

Sasikala Murder: Police question Hanumantha Rao, deepa jit

హైదరాబాద్: న్యూజెర్సీలో హత్యకు గురైన శశికళ కేసులో ఆమె భర్త హనుమంతరావుతో పాటు అతని స్నేహితురాలు దీపా అజిత్ ను మ్యాపెడ్ షేడ్ పోలీసులు శనివారం ప్రశ్నించారు. వీరితోపాటు హనుమంత రావుకి సంబంధించిన ముగ్గరు సహ ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. హనుమంతరావును పోలీసులు ప్రశ్నించడం ఇది రెండసారి.

జంట హత్య కేసులో పోలీసులు శశికళ, సాయి మృతదేహాలను స్వాధీనం చేసుకుంటారని అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధి మోహన్ తెలిపారు.

హనుమంత రావు పాస్ పోర్టు ఇంట్లో ఉండటంతో అతన్ని పోలీసులు ఇంట్లోకి వెళ్లడానికి అనుమతించడం లేదు. ఒకవేళ పోలీసులు అనుమతిని ఇస్తే అతను ఇండియాకు పారిపోయి ఆంధ్రప్రదేశ్ లోని పోలీసుల సహకారం తీసుకుంటాడనే అనుమానంతో అతన్ని పోలీసులు అనుమతించలేదు.

హనుమంత రావు గురువారం సాయంత్రం కార్యాలయం నుంచి తిరిగొచ్చిన తర్వాత తాను మృతదేహాలను కనుగొన్నట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. ఫాక్స్ మెడోస్ అపార్టుమెంట్ లోని హనుమంతరావు ఇంటిలో అతనిని దింపినట్లు తన కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సహ ఉద్యోగులు పోలీసులకు తెలిపారు.

ఇంటికి వచ్చినప్పుడు అపార్ట్ మెంట్ తలుపు తెరిచే ఉన్నాయా లేదా మీరే తాళంచెవితో తలుపు తీశారా అని పోలీసులు హనుమంతరావును ప్రశ్నించారు. “నాకు సరిగా గుర్తులేదు. ఆ సమయంలో నేను మొబైల్ ఫోన్ మాట్లడుతున్నాను“ అని హనుమంతరావు పొంతనలేని సమాధానాన్ని పోలీసులకు చెప్పాడు.

లొపలికి వెళ్లగానే హనుమంతరావు తన కుమారుడు హనీష్ సాయిని  పిలిచాడు. బదులు లేకపోవడంతో అతను తన బెడ్ రూంలోకి వెళ్లగానే మంచంపైన తన కుమారుడు హనీష్ సాయి, శశికళ నేలమీద విగతజీవులై ఉన్నారు.

ఈ హత్యలతో తనకు ప్రమెయం ఉన్నట్లు వార్తలు రావడంతో హనుమంతరావు మనస్తాపం చెందినట్లు మోహన్ తెలిపారు. అదే విధంగా తన భార్య శశికళ, కుమారుడు హనీష్ సాయి అంత్యక్రియలకు ఇండియాకు వెళ్లాలని కోరాడన్నారు. తాను అమాయకుడ్నని హంతకులను హంతకులను పట్టుకోవల్సిన బాధ్యత పోలీసులదేనని హనుమంతరావు తనతో అన్నట్లు మోహన్ చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.