శశికళ హత్య: గురువారం విజయవాడకు మృతదేహాలు

sasikala-murderdead-bodies-to-arrive-vijayawada-on-thursady

sasikala-murderdead-bodies-to-arrive-vijayawada-on-thursady

విజయవాడ: అమెరికాలో హత్యకు గురైన శశికళ, ఆమె కుమారుడు అనీష్ సాయి మృతదేహాలు గురువారం ఉదయం భారతదేశం చేరుకునే అవకాశం ఉంది. బర్లింగ్టన్ పోలీసులు లాంఛనాలు పూర్తిచేశారు. మరణ దృవీకరణ పత్రాలు అందుకున్న తర్వాత మృతదేహాలను భారతదేశం పంపడానికి తానా సభ్యులు సిద్ధంగా. న్యూజెర్సీలోనే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తానా సభ్యులు వెల్లడించారు. ఇండియాలో జరిగే అంత్యక్రియలకు తానా ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. శశికళ భర్త హనుమంత రావు, పోలీసుల దర్యాప్తుకు అధికారులతో సహకరిస్తున్నారని తెలిపారు.

ఈ హత్యల వెనుక ఉన్న కారణాలను వివిధ కోణాల్లో పోలీసులు పరిశోధిస్తున్నారు. హనుమంతరావు పాత్ర ఏ మేరకు ఉందో తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అంతే కాకుండా శశికళ కుమారుడి ముఖంపై కత్తి పోటు గాయాలు ఉన్నాయి. హనుమంతరావు కుటుంబంతో పరిచయం ఉన్న వ్యక్తే ఈ హత్యలకు ఒడికట్టాడని పోలీసులు భావిస్తున్నారు.

శశికళ, హనుమంత రావు లకు తెలిసిన అనేక మందిని పోలీసులు విచారించిన తర్వాత రెండు కీలక ఆధారాలను సేకరించారు. అందులో మొదటిది హనుమంతరావుకి వేరే మహిళతో వివాహేతర సంబంధం, రెండవది హనుమంతరావు, శశికళ అంటే గిట్టని వాళ్లు కూడా వీరిపై కోపంతో హత్యలు చేసి ఉండవచ్చు. శశికళ విజయవాడలో ఉంటున్న తన సోదరునికి పంపిన ఈమెయళ్లను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. అదే విధంగా దీపా అజిత్, హనుమంత రావు ల మధ్య జరిగిన చాటింగ్ వివరాలను కూడా పరిశీలించారు. దీనిపై ఇదివరకే హనుమంతరావును పోలీసులు ప్రశ్నించారు. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకొని పోలీసులు నిందుతులను గుర్తించే అవకాశం ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.