శశికళ హత్య: హనుమంతరావు జీవితంలో మరో మహిళ దీపా అజిత్

Sasikala’s Murder: Deepa Ajit is the other women in hanumantha rao’s life

Sasikala’s Murder: Deepa Ajit is the other women in hanumantha rao’s life

హైదరాబాద్: అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాస భారతీయురాలు శశికళ (40), ఆమె కుమారుడు హనీష్‌ సాయి (7) లు దారుణ హత్యకు గురైన సంఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శశికళ తన సోదరుడు వేణుకి ఈ మెయిల్ ద్వారా కొన్ని విషయాలను తెలిపారు. హనుమంత్ కు ఒక మలయాళి యువతితో వివాహేతర సంబంధం ఉందని ఆ మెయిల్ లో పేర్కొన్నారు. మెయిల్ వివరాలను శశికళ తల్లి తండ్రులు శనివారం మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.

“టీసీఎస్ లో పనిచేస్తున్న దీపా అజిత్ తో హనుమంత రావు పరిచయం పెంచుకున్నాడు. ప్రతి రోజు సెల్ ఫోన్ లో ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. దానిని నేను గమనించి హనుమంత్ ని ప్రశ్నిస్తే, దాంట్లో తప్పేముందని బుకాయిస్తూ, నువ్వు  దిక్కున్న చోటు చేప్పుకోపో ఏమి చేయగలవు అని కోపంతో దురుసుగా సమాధానం చెప్పాడు.“ 7 సంవత్సరాల బాబు ఉండి, వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం నాకు అసహ్యం అనిపించింది. ఈ కుట్రలో హనుమంత రావు తల్లిదండ్రులు, సోదరి, సోదరి భర్త ప్రమేయముంది. హనుమంతరావు మీద నమ్మకంతో ప్రేమ వివాహం చేసుకొని, నేను ఈ మాదిరిగా మోసపోతానని ఊహించలేదు.

ఈ విషయాలు అమ్మకు తెలిస్తే బాధపడుతుంది. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అనీష్ కోరకు అన్నీ భరించి ఇక్కడ ఉంటున్నానని శశికళ తన బాధను సోదరుడు వేణుతో మెయిల్ ద్వారా తెలిపారు. శశికళ తల్లి తండ్రులు తన కూతురు పంపిన మెయిల్  సమాచారాన్ని, అదే విధంగా దీపా అజిత్ ల మధ్య జరిగిన వాట్స్ ఆప్ చాటింగ్ వివరాలను మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. తన కూతురిని హనుమంతరావే వేధించి హత్య చేశాడనటానికి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలని ప్రశించారు.

దీపా, హనుమంతరావు వాట్సాప్ చాటింగ్ లో “నేను నీ దగ్గర ఏ విషయం దాచలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాని నా భర్త ఎదుటే చెప్పగలను. ఇదే విషయాన్నినువ్వు నీ భార్యకు చెప్పగలవా? నీకు నీ భార్యంటే భయం. ఇలా భయపడుతూ ఎంతకాలం మన సంబంధాన్ని కొనసాగిస్తావు“ అంటూ నీలదీశారు.

శశికళ యొక్క తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, కృష్ణకుమారి వారి కుమార్తె, మనుమడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుండి సహకారం అందలేదని వారు  ఆవేదన వ్యక్తం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.