శశికళ హత్య: అనీష్ చదువుకోసమే నా కూతురు అమెరికాలో ఉంది: కృష్ణకుమారి

Sasikala Murder: Sasikala was staying in America for the sake of Anish education says Krishna Kumari

Sasikala Murder: Sasikala was staying in America for the sake of Anish education says Krishna Kumari

విజయవాడ: ఈ నెల 24న న్యూజెర్సీలో హత్యకు గురైన శశికళ, కుమారుడు అనీష్ సాయి మృతదేహాలను హనుమంత రావు ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లాలో నిర్ణయించుకుంటాడని’ తానా జాయింట్ సెక్రటరీ రవి పొట్లూరి తెలిపారు. తన భార్య, కుమారుడి మృతదేహాలను చూడటానికి హనుమంతరావుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

ఈ జంట హత్యలపై మీకు ఎవరిపైనా అయినా అనుమానం ఉన్నదా అని మ్యాపెల్ షేడ్ పోలీసులు హనుమంతరావుని అడిగారు. “నాకు ఎవరిపైనా అనుమానం లేదు, మేమే ఎవ్వరి జోలికి వెళ్లేవాళ్లము కాదు“ అని హనుమంతరావు అమాయకంగా సమాధానం చెప్పాడు. దీపా అజిత్ గురించి మరోసారి పోలీసులు హనుమంతరావుని ప్రశ్నించారు. ఆమెతో వివాహేతర సంబంధంపై వచ్చిన ఆరోపరణలను ఆయన కొట్టిపారేశారు. ‘నాకు, నా భార్య, కుమారుడంటే ఎంతో ప్రేమని తెలిపాడు. నా ఇంట్లో రెండు భయంకరమైన హత్యలు జరగం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని హనుమంతరావు పోలీసులకు తెలిపారు. అదే విధంగా మార్చి 24 న, అతను తన కుమారుడు, అనీష్, (7), స్కూల్ లో ఉదయం 8 గంటలకు దింపానని. అనంతరం నేను నా ఆఫీసుకు వెళ్లాను. సాయంత్రం ఆఫీసు అయిన తర్వాత ఒక పార్టీకీ హాజరయ్యాను. రాత్రి 9 గంటలకు నా స్నేహితులు నన్ను ఇంటి దగ్గర వదిలి వెళ్లారు“. తెలిపాడు.

“ఇంట్లోకి వెళ్లంగానే నేను అనీష్ ని పిలిచాను. అతను పలకలేదు. సాధారణంగా తన భార్య ఆ సమయంలో కంప్యూటర్ లో తన పని తాను చేసుకుంటుంది. అదే విధంగా అనీష్ కూడా ఐపాడ్ లో ఆడుకుంటున్నాడేమో అని భావించాను. వెంటనే బెడ్ రూమ్ లోకి ప్రవేశించాను అక్కడ రక్తం మడుగులో శశికళ, (36), అనీష్ మృతదేహాలను చూసి నేను నిర్ఘాంతపోయాను. వెంటనే బయటకు వచ్చి రాత్రి 911 నెంబరుకు పోలీసులకు సమాచారం ఇచ్చాను. అదే విధంగా నా కుటుంబసభ్యులతోపాటు శశికళ కుటుంబసభ్యులకు, తానా జాయింట్ సెక్రటరీ రవి పొట్లూరికి సమాచారం ఇచ్చాను. అదే విధంగా నా స్నేహితులతో పాటు న్యూజెర్సీలో ఉండే శశికళ బంధువుకి కూడా సమాచారం అందించానని తెలిపాడు.

“శశికళ రెండు సంవత్సరాల క్రితమే ఇండియాకు తిరిగి రావాలను కుంది. కాని తన మనవడు అనీష్ ని మెడిసిన్ చదివించాల్సిన కోరికతో అమెరికాలో ఉండాలని నిర్ణయించుకుందని“ శశికళ తండ్రి వెంకటేశ్వరావు మీడియా ప్రతినిధులకు తెలిపారు. “అనీష్ ఒక తెలివైన విద్యార్థి. అతని తరగతిలో ఎప్పుడూ మొదటి ర్యాంకులో ఉండేవాడు. అనీష్ కు డాక్టరు అవ్వాలనే కోరిక ఉండేది, దాని కోసమే మెడిసిన్ చదువుతానని మాతో చెప్పేవాడని“ వెంకటేశ్వరరావు తెలిపారు. “కూతురి వివాహమైన రెండు సంవత్సరాలకు అనీష్ పుట్టిన తర్వాత హనుమంత రావు దీపాతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అప్పటి నుండి ఇంటి ఖర్చుల కోసం శశికళకు డబ్బు ఇవ్వడం కూడా మానేశాడు. ఈ నేపధ్యంలో శశికళ 2015 తన పేరు మీద బ్యాంక్ ఖాతా తెరవడంతో భర్త హనుమంతరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అప్పటి నుండి శశికళను హనుమంతరావు శారీరకంగా, మానసికంగా హించడం మొదలుపెట్టాడని“ కృష్ణకుమారి తెలిపింది.

“నేను నెల రోజుల క్రితం మా అల్లుడు హనుమంతరావుకు ఫోన్ చేశాను. కానీ అతను మాట్లాడలేదు. ఈ విషయాన్ని నా కూతురు శశికళకు చెప్పడంతో, అతను వీలున్నప్పుడు మాట్లాడుతానని తెలిపింది. కాని నెలరోజుల తర్వాత హనుమంతరావు నాకు ఫోను చేసి కూతురు, మనువడి హత్య గురించి తెలిపాడని“ కృష్ణకుమారి గద్గదస్వరంతో తెలిపింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.