రాజమండ్రి జైలు నుండి సత్యంబాబు విడుదల

పదేళ్ళ క్రితం విజయవాడలో జరిగిన ఆయేషా హత్య కేసులో 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యాడు. ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జైలు నుండి విడుదలైన సత్యంబాబు మీడియాతో మాట్లాడాడు.

‘ఆయేషా హత్య కేసులో తనకు ప్రమేయం లేదని మొదట్నుంచి ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారని గుర్తు చేశారు. ఈ కేసులో తనకు ఆయేషా తల్లిదండ్రులు ఎంతో సహాయం చేశారని పేర్కొన్నారు. ఆయేషా తల్లిదండ్రులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆయేషా హత్య కేసులో న్యాయం గెలిచిందన్నారు. ప్రస్తుతం తన కుటుంబం దీనస్థితిలో ఉందన్న సత్యంబాబు తనను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఇప్పటికీ ఎన్నో కేసుల్లో అనేకమంది తనలాగే ఎంతోమంది అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. వారందరికీ ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు.

సత్యంబాబు జైలు నుంచి విడుదల కావడంతో అతడిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైంది సత్యంబాబు తల్లి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.