ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూలు రిలీజ్

Schedule for Vice Presidential Elections released by Election Commission

రాష్ట్రపతి ఎన్నిక తర్వాత రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం  విడుదల చేసింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం ఆగస్టు 10 తేదీతో ముగుస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

Schedule for Vice Presidential Elections released by Election Commission

జులై 4న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. జులై 4 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జులై 19న అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన. ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఫలితాలు ఉంటాయని వెల్లడించారు.

See Also: వంట మనిషి ఇలా అయ్యాడేంటి??

ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో 790 మంది సభ్యులు ఉన్నారని ప్రధాన ఎన్నికల అధికారి నసీం జైదీ ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తారని తెలిపారు. మరోవైపు రాష్ట్రపతి పదివికి ఎన్డీఎ తరువున రామ్‌నాథ్ కోవింద్, యూపీఎ తరుపున మీరా కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.