‘సీత- దుమారం రేపుతున్న షార్ట్ ఫిల్మ్’

ఇప్పుడో షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతోంది. ‘సీత-ఐ యామ్ నాట్ ఎ వర్జిన్’ అనే షార్ట్ ఫిల్మ్ ట్యాగ్ లైన్ మార్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మేడ్చల్‌ లీగల్‌సెల్‌ సభ్యురాలు ప్రసన్న నేరెడ్మెట్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. దర్శకుడు కౌశిక్, నటి సునయనలపై కేసు నమోదైంది.

సీత షార్ట్‌ఫిల్మ్‌పై నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్

అయితే ఈ షార్ట్ ఫిల్మ్ లో ప్రధాన పాత్ర సీత పాత్రధారి, సోషల్ మీడియా డబ్ స్మాష్ స్టార్ దీప్తీ సునయన స్పందించింది. టైటిల్ ను చూసి కథ ఏంటో డిసైడ్ చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించింది. వాస్తవానికి ఈ చిత్రకథకు, పురాణాల్లో సీతాదేవికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అసలు టైటిల్ లేదా ట్యాగ్ లైన్ బాగుంటే.. కథలో సీతాదేవిని తప్పుగా చూపించినా పర్లేదా? అని ఆమె తిరిగి ప్రశ్నించింది. టైటిల్ ను చూసి నిర్ణయానికి రావడం తొందరపాటు అని అంటోంది సునయన. ఈ షార్ట్ ఫిల్మ్ లో సీత పాత్ర పోషించిన తాను మహిళను కాదా? తనకు సీతమ్మవారి గురించి తెలియదా? అని ప్రశ్నించింది. తాను కూడా హిందువునేనని పేర్కొంది. ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతీసే అంశాలు ఏవీ లేవని తెలిపింది.

సాధారణంగా సినిమాలకు సంబంధించి ఇలాంటి ‘టైటిల్’ గొడవలు జరుగుతుంటాయి గానీ, ఈ సారి షార్ట్ ఫిల్మ్‌కు ఈ రచ్చ అంటుకుంది. సోషల్ మీడియాలో ఈ షార్ట్ ఫిల్మ్ టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తూ పోస్టులు వీడియోలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.