ముసలితనంలో వెకిలివేషాలు – ఎప్పుడూ ‘అదే యావ’

Senior Actor Chalapathi Rao disgusted everyone with his latest comments on Girls in Rarandoi Veduka Chuddam Movie Audio Launch

Senior Actor Chalapathi Rao disgusted everyone with his latest comments on Girls in Rarandoi Veduka Chuddam Movie Audio Launch

పెద్దమనిషి అనే గౌరవం వయసుతో వచ్చేది ఏమాత్రం కాదు … ఒక వ్యక్తి సమాజంలో ఎంత హుందాగా ఉన్నాడో అతని నడవడిక, ప్రవర్తనను బట్టే అతనికి ఆ గౌరవం ఇస్తుంటాం. అదే ఫార్ములా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా వర్తిస్తుంది. వయసు పెరిగే కొద్దీ మనిషిలో హుందాతనంరాకపోతే, వెకిలి మాటలు తగ్గకపోతే జనాలు గౌరవించడం మానేసి అసహ్యించుకోవడంలో ఎలాంటి తప్పులేదు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో తెలుగు సినీ పరిశ్రమ గౌరవాన్ని పెంచిన విశ్వనాథ్‌లాంటి పెద్దమనుషులు ఉన్న ఈ ఇండస్ట్రీలో కొంతమంది మహానుభావులు ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీ అంటేనే జనాల్లో ఉన్న చులకనభావాన్ని మరింత పెంచేలా వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది అప్పుడప్పుడు ఇండస్ట్రీ పరువు బజారుకీడుస్తున్నారు.  ఇప్పటికే ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలు, మహిళలను ‘ ఆ ‘ భావంలో చూసే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఇండస్ట్రీ సీనియర్లే అమ్మాయాలపట్ల అసభ్యంగా, నిర్లజ్జగా అందరూ ఏమనుకుంటారనుకొనే సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్‌గా నాగచైతన్య హీరోగా వస్తోన్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్‌ సందర్భంగా  టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు  అమ్మాయిలపై  చేసిన వ్యాఖ్యలు వింటే ఆయనపై ఉన్న గౌరవం పోయి ఛీత్కరించుకోవడం మాత్రం ఖాయం.

నిన్న సాయంత్రం జరిగిన ఈ వేడుకలో విలక్షణ నటన, విలనిజంతో  తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకున్న  చలపతిరావు వెకిలి మాటలపై దుమారం రేగుతోంది.   ఈ చలపతిరావు  పెద్దాయన అనుచిత వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దుమారం రేగుతోంది. ఆడియో ఫంక్షన్‌లో ముందు వరుసలో కూర్చున్న చలపతిరావుని ఉద్దేశించి ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా’ అని యాంకర్‌  ప్రశ్నించినపుడు తన జవాబుతో అందరూ నవ్వుకొని ఎంజాయ్ చేస్తారనుకొని   ఈ మహానుభావుడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా… అమ్మాయిలు హానికరం కాదు కానీ… పక్కలోకి పనికొస్తారు??? ఇలాంటి కామెంట్లు ఒక పబ్లిక్ ఫంక్షన్లో చేయడం ఎంతో జుగుప్సాకరంగా ఉంది. ఎప్పుడూ అదే యావ ఉంటే ఎలా? అని చలపతిరావుని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.ఆయన ఇచ్చిన సమాధానంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. మరోవైపు ఈయనగారి పైత్యానికి తోడు యాంకర్ రవి ఓ వెకిలి నవ్వు నవ్వి సూపర్ ఆన్సర్ సార్ అంటూ ఎంకరేజ్‌మెంట్ ఇవ్వడం చాలా ఛండాలంగా ఉంది.

 

 • Courtesy Sakshi TV

Have something to add? Share it in the comments

Your email address will not be published. • Sarma T S says:

  The comment is not expected from a character artiet turned villian
  chalapattirao

 • Anonymous says:

  Daridrudu….

 • Sasi kumar says:

  Pedarikanni khooni chesaaru amadya balakrishna kooda function lo ammaila gurinchi asahyanga comment chesaaru.Vaaluu bayatAku vachinapudu hundaaga vyavahariste gouravam rettimpu autundi.ledaa chi antaaru.

 • Anonymous says:

  పెద్ద యదవ

 • శారద.M says:

  ఆ నీచుడిని సినిమావాళ్ళు బాయ్ కాట్ చేయాలి .నాగార్జున ఆ టాగ్ లైన్ తీసేయాలి.రవిని ఏంకరింగ్ నుంచి బహిష్కరించాలి