నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి

severe-road-accident-in-hyderabad-four-persons-killed

severe-road-accident-in-hyderabad-four-persons-killed

హైదరాబాద్‌: కార్ఖానా ప్రాంతంలో గురువారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతకు గురయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. లాలాపేటకు చెందిన ఎండీ అజార్‌ (37), ఇమ్రానాబేగం (35) దంపతులతో పాటు ముగ్గురు పిల్లలు ఓ కార్యక్రమానికి హాజరై మోపెడ్ పై ఇంటికి బయల్దేరారు.

వాహనం ఆర్‌టీఏ కార్యాలయం వద్ద మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వచ్చిన జీహెచ్‌ఎంసీ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆజార్‌, అమన్‌ (9), అశ్వియా (7), అలీనా (3) అక్కడికక్కడే మృతిచెందారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వాహన డ్రైవరు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.