“శమంతకమణి” మూవీ రివ్యూ

Shamanthakamani Movie Review by Sakalam

సినిమా: శమంతకమణి

నటులు: సందీప్ కిషన్, ఆది, నారారోహిత్, సుధీర్ బాబు, చాందిని చౌదరి
సంగీతం:మణిశర్మ
ప్రొడ్యూసర్: వి.ఆనంద్ ప్రసాద్

కథ,స్క్రీన్ ప్లే,డైరెక్టర్:శ్రీరాం ఆదిత్య

Shamanthakamani Movie Review by Sakalam

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలకు క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఒకప్పుడు సోలో సినిమాలు చేసిన దానికంటే మల్టీస్టారర్ సినిమా చేస్తే బాగా వర్కౌట్ అవుతోందనుకుంటున్న యంగ్ హీరోలు ఈమధ్య  అలాంటి సబ్జెక్టుల్లో నటించడానికి ఒప్పుకుంటున్నారు. అలా టాలీవుడ్‌ యంగ్ హీరోలు నలుగురు సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది, సుధీర్‌బాబు కలిసి నటించిన సినిమా శమంతకమణి. భలేమంచిరోజులాంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా భిన్నంగా ఉంటుందా, లేక మామూలు కథనే తెరకెక్కించాడా ?

కథ:

నలుగురు యువకుల జీవితాలతో కథ మొదలవుతుంది. కృష్ణ (సుధీర్ బాబు), శివ(సందీప్ కిషన్), కార్తీక్ (ఆది), సి.ఐ రంజిత్‌గా నారా రోహిత్‌లు ఎవరి జీవితాలు, ఎవరి గోలలో వాళ్ళుంటారు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణ(సుధీర్‌బాబు) ఓ పెద్ద‌ పార్టీ ఇస్తాడు. అయితే పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి పార్కింగ్‌లోకి వచ్చిన కృష్ణకు అక్కడ ఉండాల్సిన ఐదు కోట్ల విలువచేసే తన కారు శమంతకమణి చోరీ అయ్యిందని తెలుసుకొని ఎవరు దొంగిలించారో తెలుసుకోవడానికి ఫిర్యాదు చేసిన తర్వాత ఆ కేసును సిఐ రంజిత్‌కుమార్ డీల్ చేయడం మొదలుపెడ్తాడు. కేసు విచారణలో భాగంగా కృష్ణ ఇచ్చిన పార్టీకి వచ్చిన వారిలో అనుమానంగా కనిపించిన శివ, కార్తీక్, రాజేంద్రప్రసాద్‌లను విచారిస్తాడు. అయితే వాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతూ ఉండడంతో ఆ కారు ఎవరు దొంగలించారన్న దానిపై స్పష్టత పోతుంది. అయితే ఆ కారును ఏం చేశారు? దేనికోసం 5కోట్ల విలువచేసే కారును తీసుకెళ్ళారు? ఆ కారుకి వీళ్ళకి సంబంధం ఏంటి? అసలు రంజిత్ కుమార్‌కు ఆ కారుకు ఉన్న సంబంధం ఏంటి? మరి ఈ నలుగురిలో కారు ఎవరు దొంగలించారన్నదే ‘శమంతకమణి’ స్టోరీ.

ఎనాలసిస్:

సినిమా హిట్ అవ్వాలంటే కంటిన్యుటీ మిస్ అవ్వకుండా, ఎక్కడా సస్పెన్స్ ఎలిమెంట్లు రివీల్ అవకుండా, ప్రేక్షకుడు అసలు ఏమాత్రం బోర్ అవ్వకుండా ఉంటే చాలు. ఆ సినిమా నిజంగా బ్లాక్ బస్టర్‌ అనే చెప్పుకోవచ్చు. అలాంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమానే శమంతకమణి. సినిమా స్టోరీకి తగ్గట్లుగా నటుల పెర్ఫార్మెన్స్‌ తోడైతే సినిమా ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో శమంతకమణి చూసి చెప్పేయొచ్చు. అయితే కారు పోయిన పాయింట్‌తో మొదలైన కథ  ఆ పార్టీకి ఎవరెవరు వచ్చారు? అనే దానితో మొదలు పెట్టి ఒక్కో పాత్ర, దాని క్యారెక్టరైజేషన్ చెప్పుకొంటూ ఎవరి పాత్రను కూడా తక్కువ చేయకుండా చూపిస్తూ వచ్చాడు. అయితే క్యారెక్టర్లను పరిచయం చేస్తూనే మనకు తెలియకుండా ఇంటర్వెల్ వరకు లాక్కెల్లిన తర్వాత చివ‌రి వరకు కారు దొంగతనం విషయాన్ని తేల్చకుండా కారు దొంగతనం ఎలా జరిగింది, ఎవరు చేసుంటారు అనే ప్రశ్నలను ప్రేక్షకులకు పజిల్‌లాగా వదిలి సక్సెస్ అయ్యాడు.

See Also: మ‌ల్టీస్టార‌ర్ `శ‌మంత‌క‌మ‌ణి` డిజిట‌ల్ పోస్ట‌ర్స్‌కి అమేజింగ్ రెస్పాన్స్!

అంతేగాక తన స్క్రీన్ ప్లే తో బాగా ఆకట్టుకున్నాడు దర్శకుడు. నటులని ఎంచుకోవడంతో పాటు, ఎటువంటి సంబంధం లేని నలుగురు వ్యక్తులని ఒక పాయింట్ దగ్గర కలిసేలా చేయడం కోసం రాసుకున్న సీన్లు అదరగొట్టేశాయి. ఈ సినిమాలో ముఖ్యంగా నలుగురు యంగ్‌హీరోల్లో సందీప్ కిషన్‌ తనదైన స్టైల్లో జీవించేశాడు. సందీప్ పాత్ర చాలా బాగుందనే చెప్పాలి. ఇప్పటివరకు అనేక సినిమాలు చేసి హిట్ల కోసం వెతుకుతున్న సందీప్‌కి ఈ సినిమా నిజంగా ప్లస్ అయ్యింది. తన కెరీర్‌లో శమంతకమణి క్యారెక్టర్ గుర్తుండిపోతుందని చెప్పుకోవాలి. అంతేగాక సుధీర్, ఆది, నారా రోహిత్‌లు తమ నటనకు ప్రానం పోశారు. అలాగే ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించిన రాజేంద్రప్రసాద్ కూడా తన పాత్రకు తగిన న్యాయం చేశారు. చాందిని చౌదరి, ఇంద్రజ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సస్పెన్స్ సినిమా కావడంతో కామెడీలో కాస్త వెనకబడ్డారు. కెమెరామెన్ సమీర్‌రెడ్డి కూడా చాలా బాగా సీన్లను తెరకెక్కించారు.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల పెర్ఫార్మెన్స్

సినిమాటోగ్రఫీ

క్లైమాక్స్,

సెకండ్ హాఫ్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్,

కామెడీ, సెంటిమెంట్

ఓవరాల్: మల్టీ స్టారర్ కథలకు ధైర్యాన్ని ఇచ్చే శమంతకమణి

రేటింగ్: 3.25/5

 

-శరత్‌చంద్ర

Have something to add? Share it in the comments

Your email address will not be published.