పోలీస్ ఆఫీసర్‌గా టీజర్‌లో అదరగొట్టిన శర్వానంద్

Sharwanand Radha movie Teaser Launched

Sharwanand Radha movie Teaser Launched

శతమానం భవతి ఊపులో ఉన్న శర్వానంద్ మళ్ళీ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో శర్వానంద్, లావణ్య త్రిపాఠిలు జంటగా తెరకెక్కిన సినిమా ‘రాధ’. ఈ ఉత్సాహంతోనే నూతన డైరెక్టర్ చంద్రమోహన్ దర్శకత్వంలో కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు శర్వా. భోజ్‌పురి నటుడు రవికిషన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. గతంలో వెంకీ సినిమాను ఇదే టైటిల్ తో తెరకెక్కించాలని మారుతి భావించినప్పటికి చివరి మూమెంట్ లో నిర్ణయం మార్చుకున్నాడు. శర్వానంద్ తాజా చిత్ర షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకోగా, సమ్మర్ లో ఈ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు.

టీజర్‌లో పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టేశాడు శర్వానంద్.

  

Have something to add? Share it in the comments

Your email address will not be published.