పెట్రోల్, డీజిల్ బంకులకు ఆదివారం సెలవు

Shocking News On Petrol Bunks Petrol Bunks Takes Holiday On Every Sunday in eight states Petrol pumps to be closed

Shocking News On Petrol Bunks Petrol Bunks Takes Holiday On Every Sunday in eight states Petrol pumps to be closed

ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పెట్రోలు వాడకాన్ని తగ్గించడం ద్వారా ఇంధన వనరులను పరిరక్షించుకోవాలని పిలుపును అమలు చేయాలని పెట్రోల్ బంకు యజమానుల సంఘం నిర్ణయించింది. అందులో భాగంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగానే ఇక నుంచి ప్రతీ ఆదివారం పెట్రోల్‌ బంకులు పని చేయవు. మే 14న నుంచి  ప్రతీ ఆదివారం మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో పెట్రోలు బంకులు పని చేయవు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానాల్లో ఈ నిబంధనల అమల్లోకి రానుంది.

ఆదివారం పెట్రోల్‌ బంకులను మూసివేయడం అనే నిర్ణయం ఇప్పటిదేం కాదని కొన్నేళ్ల కిత్రం ప్రతీ ఆదివారం పెట్రోల్‌ బంకులను మూసేవాళ్లమని చెబుతున్నారు బంకు యజమానులు. కానీ ఆయిల్‌ కంపెనీల కోరిక మేరకు తిరిగి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని, అయితే ఇక నుంచి ప్రతీ ఆదివారం పెట్రోల్‌ బంకులను మూసేస్తాం అని చెబుతున్నారు. ఇలా ఆదివవారం ఒక్కరోజు బంకులు మూసివేయడం వల్ల సుమారు 600కోట్ల నష్టం వస్తుందని అంటున్నారు యజమానులు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.