హత్యను ఆత్మహత్యగా సృష్టించారా??

Shocking truth revealed in Sirisha death Conspiracy

నిన్న ఉదయం బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక అనుమానాలు బయటపడుతూనే ఉన్నాయి. కేసు విచారణలో ఎన్నో మలుపులు, ఎన్నో కొత్త విషయాలు శిరీషది ఆత్మహత్య కాదు హత్యే అనే విధంగానే వెలుగులోకి వస్తున్నాయి.

Shocking truth revealed in Sirisha death Conspiracy

కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య తర్వాత కేసు విచారణ మరింత వేగవంతమయ్యింది. అందులోభాగంగా శిరీష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు కొన్ని కీలక విషయాలను గుర్తించారు.

బ్యూటీషియన్ శిరీష పోస్ట్ మార్టంలో ఆమె తలకు వెనుక భాగంలో గాయాలు ఉన్నాయని, కుడి కన్నుపై కమిలిన గాయాలు, మెడ నుమిలిన ఆనవాళ్లు, రెండు పెదవుల పై గాయాలు  కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే పోస్టుమార్టానికి సంబంధించి పూర్తి నివేదిక బహిర్గతం అయితేగానీ ఆమెపై లైంగికంగా దాడి జరిగిందా.. ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక హత్య చేశారా అన్నదే బయటికివస్తుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.