‘విద్యాబాలన్‌’కు డర్టీ పిక్చర్ చూపించిన ఓ వ్యక్తి

హీరోలు, హీరోయిన్లగానే నార్మల్‌గా జనాల్లో క్రేజ్ ఉండడం కామనే. అందుకే వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళతో కలిసి ఓ ఫోటో దిగాలనో లేక ఈమధ్య సెల్ఫీ ట్రెండ్ వచ్చిన తర్వాత అభిమానుల్లో సెల్ఫీ పిచ్చి మరీ ఎక్కువైంది. ఒక్కొక్కసారి అభిమానుల సెల్ఫీ పిచ్చి ఎంతవరకు వెళ్తుందంటే సెలబ్రిటీలనగానే వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ  అనుకొని పిచ్చిపిచ్చి వేషాలు వేయడం ఈమధ్య మరీ ఎక్కువైంది. ఇలాంటి ఘటనే ఈ మధ్య బాలీవుడ్‌లో ఓ టాప్ హీరోయిన్‌కు ఎదురైంది.

ఈమధ్య తన లేటెస్ట్ మూవీ బేగం జాన్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా నటి విద్యాబాలన్ కోల్‌కత్తాకు వెళ్ళారు. అయితే అక్కడ ఎయిర్‌పోర్ట్‌లోఓ వ్యక్తి విద్యాబాలన్‌తో సెల్ఫీ దిగాలని కోరడంతో సరేనని ఒప్పుకుందట. అయితే ఆ పైశాచికుడు తనలోని సైకో బుద్ధిని బయటపెట్టేలా సెల్ఫీ దిగేటప్పుడు ఆమె నడుము చుట్టూ చేయి వేసాడట. దాంతో చెయ్యి తీయాలని విద్యాబాలన్ వారించినప్పటికీ ఏమాత్రం వినకుండా ఫోటోలు తీసుకోవడంలో మనోడు మరీ బిజీగా ఉన్నడట. చివరికి సహనం కోల్పోయి చేసేదేంలేక ఆ సైకోపై తీవ్రంగా విరుచుకుపడిందట. తాము పబ్లిక్ ఫిగర్లమేకానీ పబ్లిక్ ప్రాపర్టీ కాదని , ఒక ఆగంతకుడు తమపై చేతులు వేస్తే పురుషులకైనా మహిళలకైనా చాలా ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పుకొచ్చింది విద్యాబాలన్.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.