కత్తి పట్టిన ‘సంఘమిత్ర’

Shruti Haasan is undergng rigorous sword training in London for her role as warrior princess in Sangamitra

Shruti Haasan is undergng rigorous sword training in London for her role as warrior princess in Sangamitra

బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి ఊపుమీదున్న శృతిహాసన్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. కాటమరాయుడు సినిమా తర్వాత ఆప్పుడు లేటెస్ట్‌గా శృతిహాసన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘సంఘమిత్ర’. ఈ సినిమాలో శృతి పోరాట యోధురాలి పాత్రలో కన్పించనుంది. బాహుబలి సినిమా ఇచ్చిన ఊపుతో తమిళ దర్శకుడు సుందర్ సి భారీగా తెరకెక్కిస్తున్న చిత్రం సంఘమిత్ర.

ఈ పాత్ర కోసం శృతి లండన్‌లో కత్తిసాము, డ్యాన్స్‌‌ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది. సుందర్‌.సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయం రవి, ఆర్య కథానాయకులుగా నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీలో భారీ బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్నారు.

Sanghamitra team

ఈ సినిమా కోసం జయం రవి, ఆర్య ఏడాదిన్నరపాటు కాల్‌షీట్లు ఇచ్చారట. శ్రీతెనండాల్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జులై ఆఖరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్ర షూటింగ్‌ను ఇండియా, అమెరికా, డెన్మార్క్, ఇరాన్, ఉక్రెయిన్ తదితర 11 దేశాల్లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.