సరసుడిగా వస్తున్న శింబు నయనతార

Simbu Nayanthara coming back with sarasudu

Simbu Nayanthara coming back with sarasudu

మొన్న.. ‘మన్మథ’, నిన్న.. ‘వల్లభ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసిన హీరో శింబు ఇప్పుడు ‘సరసుడు’గా వస్తున్నాడు. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ హీరోయిన్స్‌గా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు పాండిరాజ్‌ దర్శకత్వంలో ‘ప్రేమసాగరం’ టి.రాజేందర్‌ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్‌, జేసన్‌రాజ్‌ ఫిలింస్‌ పతాకాలపై టి.రాజేందర్‌ నిర్మించిన చిత్రం ‘సరసుడు’.

ఈ చిత్రానికి శింబు సోదరుడు టి.ఆర్‌. కురళఅరసన్‌ సంగీతాన్ని అందించారు. చాలా గ్యాప్‌ తర్వాత తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన టి.రాజేందర్‌ ఈ చిత్రానికి మాటలు, పాటలు రాయడం విశేషం. మే 2న ఈ చిత్రం ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్‌ చేసి అదేనెలలో సినిమాని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత ప్రేమసాగరం టి.రాజేందర్‌ మాట్లాడుతూ – ”ఐటి బ్యాక్‌డ్రాప్‌లో విభిన్నంగా సాగే ప్రేమకథ ఇది. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని పాండిరాజ్‌ ఎక్స్‌లెంట్‌గా తెరకెక్కించారు. రియల్‌ లైఫ్‌లో ఐటి రంగంలో పని చేసే యువతీ యువకులు ఎలా లవ్‌ చేసుకుంటున్నారు? ఎలా విడిపోతున్నారు? చివరికి వారి ప్రేమ పెళ్లిదాకా వస్తుందా? లేదా? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం వుంటుంది. ప్రజెంట్‌ యూత్‌కి కనెక్ట్‌ అయ్యేవిధంగా ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం వుంటుంది.

ఎంతో కేర్‌ తీసుకుని ప్రేక్షకులకి నచ్చేలా ఈ సినిమాని నిర్మించాం. ‘మన్మథ’, ‘వల్లభ’ చిత్రాల కంటే ‘సరసుడు’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని చాలా కాన్ఫిడెన్స్‌తో వున్నాం. మే 2న సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్‌ చేసి, మే మూడో వారంలో చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం” అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.