చంచల్‌గుడా జైలుకి శిరీష నిందితులు

Sirisha Death Accused Sravan and Rajiv sent to Chanchalguda Jail

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన శ్రవణ్‌, రాజీవ్‌లను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిన్న విచారణ తర్వాత ఈ కేసులో అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి నేరుగా ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత  నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.

Sirisha Death Accused Sravan and Rajiv sent to Chanchalguda Jail

శిరీష ఆత్మహత్య ఘటనపై విచారించిన ధర్మాసనం నిందితులు శ్రావణ్, రాజీవ్‌లు ఇద్దరికీ 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో శ్రవణ్‌, రాజీవ్‌లను పోలీసులు చంచల్‌గూడ కారాగారానికి తరలించారు.

See Also: సీసీ ఫుటేజ్ సంగతేంటి???

 

శిరీష‌ది ఆత్మ‌హత్యేన‌ని శ్ర‌వ‌ణ్ మీడియాకు తెలిపాడు.  కుకునూరుపల్లి ఎస్.ఐ.ప్రభాకర్ రెడ్డి తనకు, రాజీవ్‌కు ఉమ్మడి మిత్రుడని,  రాజీవ్, శిరీష సమస్య పరిష్కారం కోసమే ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లామని…తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత శిరీష ఆత్మహత్య చేసుకుందని శ్రవణ్ స్పష్టంచేశాడు. శిరీష ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను అనవసరంగా కేసులో ఇరికించారని శ్రవణ్ అన్నాడు. ఆ రోజు రాత్రి శిరీష, రాజీవ్ మాత్రమే స్టూడియోకు వెళ్లారని చెప్పారు. శిరీష, రాజీవ్‌ల కేసు విషయంలోనే ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళితే.. తనను ఇరికించారని చెప్పుకొచ్చాడు. తప్పంతా రాజీవ్‌దేనని అన్నాడు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.