పనిచేయని సీసీ కెమెరాలు

Sirisha Death Case: No CCTV footage recorded in RJ Studio says Police

బ్యూటీషియన్ శిరీష మృతికేసులో అనుమానాలు వ్యక్తమౌతున్న పరిస్థితుల్లో రాజీవ్, శ్రవణ్‌లు చెప్పింది నిజమా లేక కట్టుకథ అని తెలుసుకోవటానికి కీలకమైన సీసీ కెమెరాల్లో ఏం బయటపడుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే నిందితులు రాజీవ్, శ్రవణ్‌ల పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు విచారించిన పోలీసులు కొత్త విషయాలను బయటపెట్టారు.

.Sirisha Death Case: No CCTV footage recorded in RJ Studio says Police

శిరీష మృతి జరిగిన సమయంలో ఆర్జే ఫోటో స్టూడియోలో ఉన్న సీసీ కెమెరా రికార్డు కాలేదని, ఆఖరికి శిరీష ఆత్మహత్య చేసుకున్న రూంలో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయని అయితే వాటికి సర్వర్ కనెక్టివిటీ లేకపోవడంతో రికార్డు కాలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో అసలు ఆరోజు రాత్రి శిరీష ఆత్మహత్య చేసుకుందా లేక నిందితులు శిరీషను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే విషయం తెలుసుకోవడానికి ఉన్న కీలక ఆధారం లేకుండా పోయినట్లైంది. ఇక ఇప్పుడు మిగిలింది రాజీవ్, శ్రవణ్‌లు ఇద్దరు చెప్పే విషయాలే కేసుకు కీలకంగా మారనున్నాయి. అయితే ఒకవేళ శిరీషను రాజీవ్, శ్రవణ్‌లు కలిసి హత్య చేసి ఉంటే నిజాలు చెప్పే పరిస్థితి ఏమాత్రంలేదు. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఘటనలో నిజాల కన్నా పోలీసులు నమ్మే విషయాలే కీలకంగా మారనున్నాయి.

See Also: ఈ నాలుగు నెలల్లో ఏం జరిగింది??

పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను విచారించిన పోలీసులు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు హైడ్రామా చేశారు. అర్థరాత్రి పన్నెండున్నర  తర్వాత నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్ నుండి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. రాత్రి ఒకటిన్నరకు ఉస్మానియా ఆసుపత్రిలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఉస్మానియా దగ్గర ఎదురు చూస్తున్న మీడియా కళ్లుగప్పి కుకునూర్‌పల్లి తీసుకువెళ్లారు. తెల్లవారుజామున మూడున్నరకు కుకునూర్‌పల్లి చేరుకున్నారు. పోలీసులు మీడియాను చూసి కుకునూర్‌పల్లి పీఎస్‌కు వెళ్లకుండా సిద్దిపేట వైపు 25 కిలోమీటర్లు వెళ్లారు. కుకునూర్‌పల్లి రోడ్డుపై 45 నిమిషాలసేపు రాజీవ్, శ్రావణ్‌లను పోలీసులు తిప్పారు.

See Also: శిరీష, తేజస్విని ఇద్దరినీ వదిలించుకోవాలనుకున్నాడా??

ఉదయం నాలుగున్నరకు తిరిగి హైదరాబాద్ వైపు రాజీవ్, శ్రావణ్‌లను తీసుకొచ్చారు. ఉదయం ఐదున్నరకి నిందితులను బంజారాహిల్స్ పీఎస్‌కు తీసుకువచ్చిన పోలీసులు కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచి తమ విచారణ బయటికొచ్చిన విషయాలను, ఆధారాలను కోర్టుకు సమర్పించారు.

శిరీష మ‌ృతి కేసులో సీన్ రీ కన్స్‌ట్రక్షన్ చేశామని, కుకునూర్‌పల్లికి వెళ్ళి వచ్చే దారిని నిందితులతో కలిసి రీ అనలైజ్ చేశామని డీసీపీ వెంకటేశ్వర తెలిపారు. అంతేగాక కుకునూరుపల్లిలో ఎస్సై ఆత్మహత్య చేసుకున్న క్వార్టర్‌ సీజ్ చేసి ఉన్నందున లోపలికి వెళ్ళలేదని, కేసులో పూర్తి ఆధారాలు సేకరిస్తున్నామని స్పష్టంచేశారు.

See Also: అపర చాణక్యుడికి ఈ యేడాదైనా గౌరవం దక్కేనా??

Have something to add? Share it in the comments

Your email address will not be published.