శిరీష కేసులో మా కొడుకును ఇరికించారు

Sirisha Death Case takes new turn as A1 Sravan parents accused police

శిరీష అనుమానాస్పద మృతి కేసులో కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొంటున్న శ్రవణ్‌ నిర్దోషి అని, అతడిని కేసులో కావాలనే ఇరికించారని అంటున్నారు శ్రవణ్ తల్లిదండ్రులు. ఈనెల 13న వెలుగులోకి వచ్చిన శిరీష అనుమానాస్పద మృతికి సంబంధించి మొదట రాజీవ్‌ వల్లే శిరీష చనిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో పోలీసులు కొత్త అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి శ్రవణ్‌ను ఏ1 నిందితుడిగా చూపించారు. అప్పటి నుండి అసలు తెరపైకి రాని శ్రవణ్ కుటుంబసభ్యులు ఈరోజు మీడియా ముందుకు వచ్చారు.

Sirisha Death Case takes new turn as A1 Sravan parents accused police

శిరీష మృతి కేసులో ఏ1 నిందితుడు శ్రవణ్ గురించి జరుగుతున్న ప్రచారం అవాస్తవమని శ్రవణ్ తల్లిదండ్రులు స్పష్టంచేస్తున్నారు. అసలు తమ కొడుకు శ్రవణ్‌కి ఎలాంటి పాపం తెలియదని, ఇందులో కావాలనే ఎవరో ఇరికించారని ఆరోపిస్తున్నారు. శ్రవణ్‌కు అన్యాయం జరిగిందని, న్యాయం జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.

See Also: బయటికొస్తున్న కొత్త కోణాలు

ఎక్కడ విచారణ జరిపారో తమకు తెలియదని, ఈ కేసుకు తమ కుమారుడికి ఎటువంటి సంబంధంలేదని, దర్యాప్తు సమగ్రంగా జరగాలని, శ్రవణ్‌కు న్యాయం చేయాలని శ్రవణ్ తల్లిదండ్రులు కోరుతున్నారు. శిరీష అనుమానాస్పద మృతి కేసుని మీడియానే తెరమీదకు తీసుకువచ్చిందని, ఈ కేసులో నిష్పక్షపాతంగా మీడియానే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అసలు శిరీష ఎవరో తమకు తెలియదని, తమది మధ్యతరగతి కుటుంబమని  ఎస్ఐ ట్రైనింగ్ కోసం శ్రవణ్ హైదరాబాద్ వెళ్లాడని చెప్పుకొచ్చారు. ఈమధ్య హైదరాబాద్‌నుండి కూడా తిరిగివచ్చి తమతోపాటే ఉంటున్నాడని తెలిపారు. హైదరాబాద్‌లో ఏం జరిగిందో తెలియదని, ఈ కేసులో తమకు కొడుకు ఇరుక్కున్నాడని, న్యాయం జరగేలా చూడాలని శ్రవణ్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

See Also: శిరీష మృతి కేసులో బలపడుతున్న అనుమానాలు

జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించే సమయంలోనూ శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ తనను ఈ కేసులో ఇరికించారని, తనకు ఏ పాపం తెలియదని చెప్పుకొచ్చాడు. నిన్న శిరీష బాబాయి శ్రీనివాసరావు అనేక అనుమానాలు బయటపెట్టిన తర్వాత శ్రవణ్ తల్లిదండ్రులు బయటికొచ్చి మీడియా ముందు తమ అనుమానాలు వ్యక్తపరచడంతో అసలు కేసు ఎటువైపు వెళ్తోందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

See Also: సీసీ ఫుటేజ్ సంగతేంటి???

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • Manohar says:

    Prabhakar Reddy’s death may be a murder. we hope in this aspect why investigation is not being done? why Mr Reddy’s body is in uniform? n his body is in strait and his revolver is in other side of his right hand