బయటికొస్తున్న కొత్త కోణాలు

Sirisha Death New audio tapes takes the case into new angle

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త కోణం బయటికొస్తోంది. కేసులో ఎన్నో ఊహించని ట్విస్టులు రోజుకొకటి బయటపడుతున్నాయి. కొంత కాలం క్రితం తేజస్వినితో గొడవ అయిన తర్వాత రాజీవ్, మరో ఇద్దరు యువకులతో శిరీష మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Sirisha Death New audio tapes takes the case into new angle

తాజాగా బయటపడిన ఆడియోలో ఆమె నోటి నుంచి వచ్చిన నందు, నవీన్ అనే రెండు కొత్త పేర్లు కేసులో కీలకంగా మారాయి. తేజస్విని పేరు ప్రస్తావించకుండా ఆమెపై ఉన్న కోపాన్నంతా శిరీష తాజాగా విడుదలైన ఆడియోలో బయటపెట్టింది. రాజీవ్‌పై తన ప్రేమను ఫోన్‌లో నవీన్‌, నందుతో శిరీష​ చెప్పడం, తనకు రాజీవ్‌ అంటే ఎంతో ప్రాణమని, రాజీవ్‌ను ఎవరన్నా ఏమన్నా అంటే చంపేస్తానని కూడా శిరీష ఫోన్‌లో హెచ్చరించింది.

రాజీవ్‌ ప్రియురాలు తేజశ్విని గురించి శిరీష​ మాట్లాడిన మాటలు ఆడియోలో ఉన్నాయి. తమ మధ్య తేజశ్విని రాకుండా చూడాలని రాజీవ్‌ స్నేహితులను కోరింది. అయితే ఈ ఆడియో టేపులు ఎవరి బయటపెట్టారనేది వెల్లడికాలేదు. ఆడియో టేపులు తాము విడుదల చేయలేదని పోలీసులు తెలిపారు.

See Also: సీసీ ఫుటేజ్ సంగతేంటి???

కాగా, శిరీషపై అత్యాచారం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఫోరెన్సిక్‌ రిపోర్టులు వచ్చిన తర్వాత పూర్తి నిర్ధారణకు రానున్నారు. ఈనెల 12న అర్ధరాత్రి కుకునూర్‌పల్లి పోలీస్‌ క్వార్టర్‌లో చోటుచేసుకున్న విషయాలను పోలీసులు రిమాండ్‌ డైరీలో కోర్టుకు వివరించారు.

అంతేగాక తేజస్విని, శిరీషల మధ్య వాట్సప్‌లో మెసేజ్‌ల యుద్ధం కొనసాగింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న మూడు మొబైల్స్‌లో రాజీవ్, శిరీష, తేజస్విని, నవీన్, నందు, రవి అనే వ్యక్తుల సంభాషణలను గుర్తించారు. వీటికితోడు కొన్ని వీడియోలు కూడా మొబైల్స్‌లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

See Also: అసలు శ్రవణ్‌ ఎవరు???

ఆ మెసేజ్‌ల్లో శిరీష ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆధారాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు పోలీసులు. తాజా ఘటనల నేపథ్యంలో విజయవాడకు చేరిన తేజస్విని దగ్గరికి వెళ్లి పోలీసులు మరికొంత సమాచారం సేకరించారని టాక్. అయితే ఆ ఆడియోలో గొంతు శిరీషదేనా.. కాదా? అనేది దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. అంతేగాక శిరీష లో దుస్తులపై రక్తపు మరకలు ఉన్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో శిరీషపై అత్యాచారం జరిగిందా? లేదా? అనే విషయం ఫోరెన్సిక్ నివేదికలో తెలిసే అవకాశముంది.

See Also: ఒక్క నిమిషం ఆలోచిద్దామా??

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.