శిరీష మృతి కేసులో బలపడుతున్న అనుమానాలు

Sirisha Death New doubts arises among Family members

శిరీష ఆత్మహత్యపై రోజుకో కొత్త అనుమానం తెరపైకి వస్తోంది. దీంతో బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. పోలీసులు చెప్పిన వివరాలతో ఏకీభవించని ఆమె కుటుంబ సభ్యులు కేసు పక్కదోవ పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక పోలీసులు, మీడియా కలిసి శిరీష వ్యక్తిత్వంపై చెడు ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Sirisha Death New doubts arises among Family members

శిరీష అనుమానాస్పద మృతి, ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య విషయంలో పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బెంగళూరులో ఉండే శిరీష బాబాయి.. ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. శిరీష ఆత్మహత్య చేసుకుంటే ఆమె ఒంటిపై ఉన్న గాయాలపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా పోలీసులకు ఎక్కడా శిరీషకు సంబంధించిన సీసీఫుటేజ్‌ దొరకకపోవడమేంటని కుటుంబసభ్యులు పోలీసులను నిలదీస్తున్నారు. మరోపక్క ఎస్సై ప్రభాకర్ రెడ్డి క్వార్టర్‌కు శిరీష వెళ్లలేదని ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బలంగా వాదిస్తున్నారు. దీంతో కుకునూరుపల్లి గ్రామస్థులు మరోసారి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. గ్రామస్తులు కూడా ఆందోళన చేస్తుండటంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది.

See Also: బయటికొస్తున్న కొత్త కోణాలు

తమ బిడ్డది ముమ్మాటికీ హత్యే అంటున్నారు శిరీష బాబాయి శ్రీనివాసరావు. ‘శిరీషను వేశ్యగా చిత్రీకరించేందుకు’ మీడియా ఛానెళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక శిరీష తన కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్న వ్యక్తి అని, నిందితులు, పోలీసులు, మీడియా చెబుతున్నట్లు శిరీష క్యారెక్టర్ చెడ్డదే అయితే.. ఐదు నిమిషాలే కదా అని ఎస్ఐకి సహకరించి ఉండకపోయేదా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

శిరీష వ్యక్తిత్వం గురించి తెలియని పోలీసులు, మీడియా.. ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీనివాసరావు. ఇక శిరీష ఆత్మహత్య చేసుకుందన్న ప్రచారాన్ని ఖండించిన ఆయన, ఆమె మెడ చుట్టూ నైలాన్ తాడుతో బిగించిన గుర్తులు ఉన్నాయని, మొదట నైలాన్‌తాడుతో మెడ చుట్టూ బిగించి చంపేశారని, ఆ తర్వాత చున్నీతో ఉరేసుకున్నట్లుగా వేలాడదీశారని, అందువల్లే మెడ ఎముకలు విరిగాయని ఆరోపిస్తున్నారు.

మరోవైపు అసలు శిరీష కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళిందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.  రాజీవ్, శ్రవణ్‌లు శిరీషను కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లలేదని, అక్కడికి 4కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రిసార్టుకు ఆమెను తీసుకెళ్లారని శిరీషను ఉద్దేశపూర్వకంగానే హత్య చేసి ఆత్మహత్యగా డ్రామాకు తెరలేపారని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు.

1.58 నిమిషాలకు శిరీష తన భర్తకు వాట్సప్‌లో లొకేషన్ షేర్ చేసిందని పోలీసులు చెబుతున్నారని, ఆ లొకేషన్‌ను పరిశీలిస్తే.. కమిషనర్ చెప్పినట్లు పోలీస్ క్వార్టర్స్‌ కాకుండా అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాన్ని అది చూపిస్తోందని ఆయన తెలిపారు. శిరీష ఆత్మహత్య కేసులో సంచలనం కోసం మీడియాలో వస్తున్న కథలు బాధాకరంగా ఉన్నాయని శిరీష కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

See Also: అసలు శ్రవణ్‌ ఎవరు???

శిరీష తలపై గాయం జుట్టు పట్టుకొని లాగితే అయ్యింది కాదని, బలంగా కొట్టడం ద్వారా అయిందన్నారు. జుట్టుపట్టుకొని లాగితే తలకు అంతపెద్ద గాయం అవుతాదా? అని ప్రశ్నించారు.శిరీషను కొట్టి చంపేశారు… ‘శిరీష వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు కారు దిగి పారిపోయింది. ఈక్రమంలో ఎక్కడో ఏదో చెట్టుకింద ఉండి తన లొకేషన్‌ను భర్తకు షేర్ చేసింది. పారిపోయిన శిరీషను పట్టుకొని బలంగా కొట్టి చంపేశారు. ఆ తరువాత రాజీవ్, శ్రవణ్, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ముగ్గూరు కలిసి డ్రామా ఆడి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని అంటున్నారు శ్రీనివాసరావు. వాస్తవాలు వదిలేసి.. తమ బిడ్డ క్యారెక్టర్‌పై చెడు ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుందన్నారు.

శ్రీనివాసరావు బయటపెట్టిన అనుమానాలు:

1. అర్థరాత్రి 1.58 గంటలకు శిరీష తన భర్తకు వాట్సప్ లో లొకేషన్ షేర్ చేసిందని పోలీసులు చెప్పారు. మరి.. అదే నిజమైతే.. కుకునూరుపల్లి క్వార్టర్స్ను చూపించాలే కానీ.. అక్కడకు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న లొకేషన్ చూపించటం ఏమిటి?

2. అసలు శిరీష పోలీస్ క్వార్టర్కు వెళ్లిందా? శిరీష అండ్ బ్యాచ్ క్వార్టర్స్కు వెళ్లలేదు.. వీరంతా ఒక రిసార్ట్స్ లో కలిసి ఉన్నారు .

3. కుకునూరు ఎస్ ఐ దగ్గర సెటిల్ మెంట్ కోసం వెళ్లారని చెబుతున్నారు కదా? అసలు.. ఆ సెటిల్ మెంట్ ఏమిటి?

4. అపార్ట్ మెంట్లోకి వెళ్లి శిరీష ఉరి వేసుకొందని చెబుతున్నారు. శిరీష ఎత్తు 5.11 అడుగులు. ఈ లెక్కన రూమ్ లో కాట్ ఎత్తు.. ఫ్యాన్ ఎత్తు పరిశీలిస్తే.. ఉరి వేసుకునే అవకాశమే లేదు.

5. శిరీష నెత్తి మీద ఉన్న గాయం.. జుట్టు పట్టుకొని లాగటం ఎంతమాత్రం కాదు. బలంగా కొట్టటం వల్లే అయి ఉంటుంది. ఎందుకంటే శిరీష వారి నుంచి తప్పించుకునేందుకు కారు దిగి పారిపోయి ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడో చెట్టు కింద ఉండి తన లొకేషన్ను భర్తకు షేర్ చేసింది. అయితే.. పారిపోయిన శిరీషను పట్టుకొని బలంగా కొట్టి చంపేసి ఉంటారు. ఆ తర్వాత రాజీవ్.. శ్రవణ్.. ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డిలు కలిసి డ్రామా ఆడిఉంటారు

6. శిరీషకు సంబంధించి ఇప్పటివరకూ సరైన సీసీ పుటేజ్ దొరక్కపోవటం ఏమిటి?

See Also: సీసీ ఫుటేజ్ సంగతేంటి???

ఇలాంటి అనేక అనుమానాలు శిరీష కుటుంబసభ్యులు వ్యక్తపరుస్తున్నారు. అంతేగాక శ్రవణ్, రాజీవ్‌లను పోలీస్ కస్టడీలో విచారిస్తే శిరీషను ఎందుకు వారు టార్గెట్ చేశారు?.. వదిలించుకోవాలనుకున్నారా.. ఇందుకోసం వేశ్యగా ముద్ర వేయాలనుకున్నారా? లేక మరేమైనా కారణాలున్నాయా? అన్నది తేలాల్సి ఉంది. దీనికి తోడు కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లోని సీసీటివి ఫుటేజీ మాయమవడం కూడా కేసుపై అనుమానాలను మరింత పెంచుతోంది.

మొత్తానికి మిస్టరీగా ఉన్న పలు అంశాలపై స్పష్టత వస్తే తప్ప శిరీష కేసుకు సంబంధించి హత్యనా, ఆత్మహత్యనా అని తేలే అవకాశం లేదు.

See Also: హత్యను ఆత్మహత్యగా సృష్టించారా??

Have something to add? Share it in the comments

Your email address will not be published.