నిజం ఇప్పుడైనా బయటికొస్తుందా??

Sirisha Death: Police have taken Rajiv and Sravan into two days custody
మిస్టరీగా మారిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో విచారణ వేగవంతం చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అందులోభాగంగా ఇప్పటికే నిందితులు శ్రవణ్, రాజీవ్‌లను విచారించినప్పటికీ మరింత సమాచారం కోసం జ్యుడీషియల్ కస్టడీ నుండి పోలీస్ కస్టడీకి తీసుకున్నారు.
Sirisha Death: Police have taken Rajiv and Sravan into two days custody
శిరీష మృతి కేసులో శిరీష కుటుంబసభ్యులు లేవనెత్తిన అనుమానాల నివృత్తి కోసం బంజారాహిల్స్ పోలీసులు నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. అందులోభాగంగా ఈరోజు ఉదయం చంచల్‌గుడా జైలునుండి  శిరీష ఆత్మహత్య కేసులో ఏ1 శ్రవణ్ , ఏ2 రాజీవ్‌ను కస్టడీలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారణకు తరలించారు.

See Also: బయటికొస్తున్న కొత్త కోణాలు

ఈ నెల 13న తేదీ మంగళవారం తెల్లవారుజామున ఫిల్మ్‌ నగర్‌ లోని ఆర్‌జే ఫొటోగ్రఫీ స్టూడియోలో శిరీష ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మరోవైపు సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్య అనంతరం జరిగిన ఆందోళనపై సిద్ధిపేట పోలీసులు మూడు వేరు వేరు కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు.

See Also: శిరీష కేసులో మా కొడుకును ఇరికించారు

శిరీషను ఎందుకు కొట్టారు…. ఎలా చంపారు అన్న విషయాలపై విచారణ జరుపనున్నారు. శిరీష ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక విచారణలో అంచనాకు వచ్చిన పోలీసులకు శ్రవణ్, రాజీవ్‌లు ఏవైనా కట్టుకథలు చెప్పారా లేక నిజాలు వెల్లడించారా అన్న దానిపై పూర్తి విచారణ చేయనున్నారు. అంతేగాక శిరీషను రాజీవ్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది… అసలు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళారు. అసలు సెటిల్మెంట్‌కు సంబంధించి ప్రభాకర్‌రెడ్డిని మధ్యలోకి ఎందుకు తీసుకొచ్చారు. రాజీవ్ కొట్టిన దెబ్బలకే శిరీష చనిపోయిందా… అసలు పోలీస్ క్వార్టర్లకు వెళ్ళారా లేక పక్కనే ఉన్న రిసార్టుకు వెళ్ళారా అనే అనేక అంశాలపై స్పష్టత కోసం నిందితులను ప్రశ్నించనున్నారు పోలీసులు.
Sirisha Death Accused Sravan and Rajiv sent to Chanchalguda Jail
మరోవైపు కేసు విచారణలో భాగంగా నిందితులను కుకునూరుపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్ళి అక్కడే విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నందు, నవీన్‌ ఎవరు? శిరీష కోరిన మీదట వారు తేజస్వినితో మాట్లాడారా? లేక మాట్లాడామంటూ శిరీషతో చెప్పారా? అనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. శిరీష కాల్‌ డిటైల్స్‌ ఆధారంగా వీరిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. కస్టడీలోకి వచ్చిన తర్వాత నందు, నవీన్‌ వివరాలు రాబట్టాలని నిర్ణయించారు. మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న శిరీష –నందు –నవీన్‌ సంభాషణల ఆడియోలు ఎక్కడివనేది ఇప్పుడు కీలకంగా మారింది. వీటిని ఎవరో ఉద్దేశపూర్వకంగా లీక్‌ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంభాషణను బట్టి అవి శిరీష, ఆమె స్నేహితుడు నందు ఫోన్ల మధ్య జరిగినట్లు తెలు స్తోంది. వారి ఫోన్లలోనే వీటి రికార్డింగ్‌కు ఆస్కారం ఉంది. శిరీష చనిపోయిన రోజే ఆమె ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

See Also: శిరీష మృతి కేసులో బలపడుతున్న అనుమానాలు

అంతేగాక ఈ మొత్తం వ్యవహారంలో తేజస్విని పాత్రపై ఆరా తీయాల్సి ఉందని, ఆమెకు, శిరీషకు ఉన్న గొడవలకు కారణాన్ని వెలికితీయాల్సి ఉందని, రాజీవ్‌–తేజస్విని మధ్య సంబంధాలను ఆరా తీయాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. శిరీష–శ్రవణ్‌–రాజీవ్‌ కారులో కుకునూర్‌పల్లి వెళ్లే దారిలో ఏమైందనే దానిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.