ఈ నాలుగు నెలల్లో ఏం జరిగింది??

Sirisha death: Relatives accusing police and new turn in investigation

బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో మొదటినుండి అనుమానాలు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. శిరీష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రకటించనప్పటినుండి శిరీష కేసులో పునర్విచారణ జరిపించాలని బంధువులు డిమాండ్ చేయడంతో పోలీసులు కేసులో కూపీని లాగే పనిలో పడ్డారు. తేజస్విని తన వాగ్మూలంలో చెప్పినట్లు నాలుగు నెలల క్రితం అసలు సంగతి మొదలైందని చెప్పడంతో ఈ నాలుగు నెలల్లో ఏం జరిగిందన్న ఉత్కంఠ ఎక్కువైంది.

Sirisha death: Relatives accusing police and new turn in investigation

మొదటి నుండి పోలీసుల విచారణపై శిరీష బంధువుల అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. శిరీష అనుమానాస్పద మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్న కుటుంబ సభ్యులు శిరీషను వ్యభిచారిగా చిత్రీకరించి కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేగాక శిరీష చనిపోయిన తర్వాత శిరీష శవాన్ని బంధువులు అందరూ చూసేందుకు సైతం  అవకాశం ఇవ్వకుండా పోలీసులు తొందరచేశారని, అందువల్లే  పోలీసుల ఒత్తిడితోనే త్వరగా దహనసంస్కారాలు పూర్తి చేయాల్సి వచ్చిందని ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు.

See Also: శిరీష, తేజస్విని ఇద్దరినీ వదిలించుకోవాలనుకున్నాడా??

అసలు 12వతేదీ మద్యాహ్నం ఒక పెళ్ళి అపాయింట్‌మెంట్ ఉందని సాయంత్రం కల్లా వచ్చేస్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరి వెళ్లిందని, అయితే తనకు ఆలస్యం అవుతుందని రాత్రి 8 గంటల 40 నిమిషాలకు భర్తకు ఫోన్ చేసి చెప్పిందట. ఆ తర్వాత  రాత్రి 11 గంటల వరకు వేచి చూసిన సతీష్ చంద్ర, కూతురు దివ్య పడుకున్నారు. తరువాతి రోజు తెల్లవారుజామున 4గంటల 10 నిమిషాలకు శిరీషకు భర్త ఫోన్ చేసినా ఎటువంటి  జవాబు రాలేదు. దీంతో శిరీష కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఉదయం 5గంటల 40 నిమిషాలకు బేగంపేటలో తను పనిచేసే స్కూల్లో ఉద్యోగానికి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత ఉదయం 6గంటల 40 నిమిషాలకు శిరీష చనిపోయిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి సతీష్‌కు కాల్ వెళ్లింది. అయితే ఆర్‌జే ఫోటో స్టూడియోకి వెళ్లిన భర్త సతీష్ బెడ్‌పై నిర్జీవంగా పడి ఉన్న శిరీషని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేగాక శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసు విచారించిన పోలీసులు శిరీష ఆత్మహత్య చేసుకుందని ఒక నిర్ణయానికి వచ్చి ప్రకటించేశారు.  ఆ తర్వాత శిరీష బంధువులు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసే పనిలో పడ్డారు పోలీసులు.

See Also: నిజం ఇప్పుడైనా బయటికొస్తుందా??

అయితే శిరీష కేసును పోలీసులు ఏమాత్రం తప్పుదోవ పట్టించడం లేదని, శిరీష బంధువులకు అనుమానాలుంటే హైదరాబాద్ రావాలని డీసీపీ వెంకటేశ్వరరావు తెలియచేశారు. శిరీష బంధువులకు వస్తున్న అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామని, పోలీసులపై అనవసరంగా విమర్శలు చేయొద్దని స్పష్టంచేశారు. నిందితులను ఎవరినీ కాపాడాలన్న ఉద్దేశం పోలీసులకు లేదని, శిరీష వాట్సాప్ లోకేషన్ కుకునూరుపల్లి పీఎస్ క్వార్టర్స్‌దేనని తెలియచేశారు డీఎస్పీ. ముఖ్యంగా శిరీషను రేప్ చేశారో లేదో ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే తెలుస్తుందని చెబుతున్నారు.

మరోవైపు తేజస్విని ఇచ్చిన వాగ్మూలంలో నిజానిజాలను తెలుసుకొనే పనిలో పడ్డారు పోలీసులు. 4 నెలల క్రితమే రాజీవ్‌పై తేజస్వినికి అనుమానం వచ్చిందని ఫేస్‌బుక్‌లో శిరీష ఫోటోలను రాజీవ్ ట్యాగ్ చేయడంతో అసలు గొడవ మొదలైందని అంచనాకి వస్తున్నారు. అయితే శిరీష ఫోటోలు ట్యాగ్ చేయడంపై రాజీవ్‌ను నిలదీసిన తేజస్వినికి  శిరీష కేవలం ప్రొఫెషనల్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి తప్పించుకున్నాడు. దీంతో శిరీషను వదిలివేయాలని, శిరీషను వదిలేయకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తేజస్విని రాజీవ్‌ను హెచ్చరించింది. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు అనేకం ఈ నాలుగు నెలల్లో జరిగాయని, ఫోన్లలో పరస్పరం ఒకరినొకరు దూషించుకొనే స్థాయి వరకు వెళ్ళిందని తేలింది.

See Also: శిరీష మృతి కేసులో బలపడుతున్న అనుమానాలు

తేజస్విని వాగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా శ్రవణ్‌ను కూడా విచారిస్తున్నారు. పోలీసు విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు శ్రవణ్. మే 30, 31న ఎస్సై ప్రభాకర్ రెడ్డికి ఒక సమస్య ఉంది, సెటిల్ చేయాలని కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ చేశానని, బంజరాహిల్స్‌లోని ఎస్సై హరీందర్‌కు ఫోన్ చేయాలని కోరానని తెలిపాడు శ్రవణ్. మే 31న ఎస్సై హరీందర్‌కు ప్రభాకర్‌రెడ్డి పోన్ చేయడంతో రాజీవ్, శిరీష, తేజస్వినిల కేసును ఎస్సై శ్రీనివాస్ టేకప్ చేశారని ప్రభాకర్‌రెడ్డికి హరీందర్ తెలియచేశారు. ఆ తర్వాత మరో రెండుసార్లు ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ చేశానని, బంజారాహిల్స్ పోలీసులు కేసును సెటిల్ చేయకపోవడంతో శిరీష, రాజీవ్‌లు ఇద్దరినీ వెంట తీసుకొని కుకునూరుపల్లికి వస్తామని ప్రభాకర్‌రెడ్డికి తానే చెప్పానని శ్రవణ్ పోలీసులకు వెల్లడించాడని సమాచారం.

See Also: అసలు శ్రవణ్‌ ఎవరు???

Have something to add? Share it in the comments

Your email address will not be published.