శిరీష, తేజస్విని ఇద్దరినీ వదిలించుకోవాలనుకున్నాడా??

మిస్టరీగా మారిన బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో పోలీసుల విచారణ వేగవంతం అయ్యింది. ఆత్మహత్య చేసుకోవడం కారణంగానే శిరీష చనిపోయిందని ప్రకటించిన పోలీసులకు శిరీష కుటుంబసభ్యులు లేవనెత్తిన అనుమానాలతో కేసును పునర్విచారణ చేస్తున్నారు. అందులోభాగంగా సోమవారం ఉదయం చంచల్‌గుడా జైలు నుండి తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నిందితులు శ్రవణ్, రాజీవ్‌లను విచారిస్తున్నారు. విచారణలో రాజీవ్ చెప్పిన విషయాలు, వాగ్మూలంలో తేజస్విని చెప్పిన విషయాలు కేసును కొత్త రూట్‌లోకి తీసుకెళ్ళనున్నాయి. అసలు రాజీవ్, తేజస్వినిలిద్దరు పోలీసులకు ఏం చెప్పారు??

Sirisha Death Tejaswini and Rajeev reveals more secrets

ఈ కేసులో విచారణ కోసం బంజారాహిల్స్‌కు వచ్చిన సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రంతో రిమాండ్‌ గడువు ముగియడంతో మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 12న రాత్రి కుకునూర్‌పల్లిలో అసలు ఏం జరిగిందనే విషయంపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

See Also: నిజం ఇప్పుడైనా బయటికొస్తుందా??

మరోవైపు ఈకేసులో కీలకంగా మారిన తేజస్విని వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు పోలీసులు. కేసును మరింత లోతుగా విచారించేందుకు తేజస్విని వాగ్మూలం పనికొస్తుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల విచారణలో భాగంగా తేజస్విని పలు కీలక అంశాలను వెల్లడించింది. శిరీష ఆత్మహత్య తనకు ఎంతో బాధ కలిగించిందని, ఇంత చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకుంటుందని తాను ఊహించలేదని తెలిపింది. అంతేగాక తాను రాజీవ్ ను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, తమ ఇద్దరి మధ్య శిరీష అడ్డురావడంతో రాజీవ్ వెనకడుగు వేశాడని స్పష్టంచేసింది. రాజీవ్‌కు తెలియకుండా అనేక సార్లు శిరీషతో ఫోన్లో గొడవపడ్డానని, ఇంతకు ముందు బంజారాహిల్స్ పీఎస్‌లో కేసులు పెట్టుకున్నామని స్పష్టంచేసింది.

 

అంతేగాక రాజీవ్ కోసమే తాను బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చానని తెలిపిన తేజస్విని, రాజీవ్ వ్యవహారం అనుమానస్పదంగా ఉండడంతో విజయవాడ వెళ్లి రాజీవ్ తల్లిని కలిసానని తెలిపింది. అయితే తమ పెళ్ళికి రాజీవ్ తల్లి ఒప్పుకోకపోవడం అదే సమయంలో తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన మాట వాస్తవమేనని పోలీసులకు తన వాగ్మూలంలో స్పష్టం చేసింది తేజస్విని. అయితే తనకు రాజీవ్ మోసం చేశాడన్న కోపం మాత్రమే ఉందని, శిరీషతో తనకు ఎలాంటి సంబందాలు లేవని చెప్పుకొచ్చింది.

See Also: శిరీష మృతి కేసులో బలపడుతున్న అనుమానాలు

రాజీవ్‌ను ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలనుకున్నానని అయితే  ఈ మొత్తం వ్యవహారంలో రాజీవ్ తనను మోసం చేశాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసుకుంది తేజస్విని. మొత్తానికి మిస్టీరీగా మారిన శిరీష మ‌ృతి కేసుకు సంబంధించి పోలీసులు రాజీవ్, శ్రవణ్‌లను మరోసారి ప్రశ్నిస్తున్నారు.విచారణలో రాజీవ్ అనేక కీలక విషయాలను బయటపెట్టాడని సమాచారం.

తన జీవితానికి ఇబ్బందిగా మారిన శిరీష, తేజస్వినిలిద్దరినీ వదిలేయాలని డిసైడ్ అయ్యే ఎస్‌ఐ ప్రబాకర్‌రెడ్డిని రంగంలోకి దింపినట్లు రాజీవ్ పోలీసులకు చెప్పాడని టాక్. అంతేగాక తేజస్వినిని పెళ్ళి చేసుకునే ఉద్దేశం కూడా తనకు లేదని రాజీవ్ చెప్పినట్టు సమాచారం. తేజస్విని విషయం ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదని, దీంతో శిరీష, తేజస్వినిని వదిలేయాలని నిర్ణయించుకున్నానని పోలీసులకు రాజీవ్ తెలియచేశాడని విశ్వసనీయ సమాచారం. ఈ లోగానే వాళ్లిద్దరూ తీవ్రస్థాయిలో గొడవకు దిగడంతో తానే పోలీసులకు సమాచారం ఆందించానని రాజీవ్ చెప్పాడు. అయితే రాజీవ్ చెప్పిన విషయాల్లో నిజానిజాలు తెలుసుకునేందుకు ఇప్పటికే తేజస్విని వాగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు శిరీష ఆడియో టేపుల్లో బయటపడ్డ నందు, నవీన్‌ను కూడా విచారించాలని  భావిస్తున్నారు.

See Also: బయటికొస్తున్న కొత్త కోణాలు

Have something to add? Share it in the comments

Your email address will not be published.