అసలు శ్రవణ్‌ ఎవరు???

Sirisha Death Who is this Sravan involved in case as A1

విద్యార్థి జీవితం నుండే రాజకీయాల్లోకి రావాలని, ఫుల్ పాపులర్ అవ్వాలని, జనాలు తనను సెలబ్రిటీలా చూడాలనుకొనే మనస్తత్వం అతన్ని ఎలాంటి వారితోనైనా చనువుగా ఉండేలా చేసి, జీవితంలో కొత్త నేస్తాలను వెతికిపెట్టింది. ఎక్కడో చిన్న పల్లెటూరిలో పుట్టి కాలేజీలో చదువుకొనేటప్పుడు తనను గుర్తించాలనే తపన ఎక్కువగా ఉండడంతో రాజకీయనాయకుల చుట్టూ తిరిగి కనిపించిన వాళ్ళతో ఫోటోలు దిగి, వాళ్ళతో చనువుగా ఉండి, అవసరమైన పనులు చేయించుకొని బడా బాబులా బిల్డప్‌ కొట్టిన శ్రవణ్‌కుమార్ చివరికి ఊచలు లెక్కపెడుతున్నాడు.

Sirisha Death Who is this Sravan involved in case as A1

 

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడుకొండ్ల గ్రామానికి చెందిన శ్రవణ్ ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారాడు. తండ్రి రమేశ్ సివిల్ కాంట్రాక్టర్ అవడంతో రాజకీయాలవైపు మనసులాగడంతో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యుఐలో కీలక సభ్యుడిగా మారాడు. మొదటినుండి శ్రవణ్‌కు అమ్మాయిలంటే మోజు ఎక్కువ. ప్రతీరోజు పార్టీలు, పబ్‌లు, రాత్రయితే చాలు అమ్మాయిలతో జల్సాలు.. అందుకోసమే ఎప్పుడో హైదరాబాద్‌కి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. తాను అనుకున్న పని జరగడానికి ఎంతకైనా తెగిస్తాడన్న పేరు కూడా శ్రవణ్‌కు ఉంది. తన పని చేయించుకోవడానికి ఎదుటివాళ్ళకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చడం అలవాటు చేసుకున్నాడు.

See Also: చంచల్‌గుడా జైలుకి శిరీష నిందితులు

మొదటినుండి పోలీస్ సర్కిల్‌తో ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేస్తున్నశ్రవణ్‌కు తమ ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్లలో వచ్చే పోలీస్ ఆఫీసర్లతో పరిచయాలు పెంచుకోవడంతో పాటు తన పనులు చేయించుకోవడం కోసం వాళ్ళకు ఇష్టమైన గిఫ్ట్స్ ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు. అందులో ఒక్కొక్కసారి అమ్మాయిలు కూడా ఉండేవాళ్ళు. ఇలా పోలీస్ ఆఫీసర్లతో సాన్నిహిత్యంగా ఉండే సమయంలో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ప్రొబేషనరీ పీరియడ్‌లో మాల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు శ్రవణ్‌కు అతనికికి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది.

కొద్దిరోజులకే వాళ్ళిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆ తర్వాత హైదరాబాద్‌లో పనిచేసి కుకునూర్‌పల్లికి మారిన తర్వాత కూడా శ్రవణ్ తనతో టచ్‌లో ఉండేవాడు. మధ్యలో అవసరమైనప్పుడు  రెండు మూడుసార్లు కొంతమంది కాల్ గర్ల్స్‌ను  ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి పంపించానని పోలీసుల వాగ్మూలంలో చెప్పాడు శ్రవణ్.

 See Also: సీసీ ఫుటేజ్ సంగతేంటి???

రాజీవ్‌తో కలిసి ఆర్జే ఫోటోగ్రఫీలో బ్యూటీషియన్‌గా పనిచేసే శిరీష ఒకసారి శ్రవణ్ స్నేహితుడి వివాహానికి వచ్చినప్పుడు చేసుకున్న పరిచయాన్ని కొద్దిరోజుల్లోనే తరుచూ ఆమెతో టచ్‌లో ఉంటూ స్నేహాన్ని పెచుకున్నాడు. మధ్యమధ్యలో శిరీషను కలిసిన శ్రవణ్ శిరీషకు తన ఫ్రెండ్స్ సర్కిల్‌లో చాలాసార్లు మేకప్ పని ఇప్పించాడు. ఇదే క్రమంలో.. శ్రవణ్‌ను శిరీష రాజీవ్‌కు పరిచయం చేసింది. రాజీవ్‌కు  అవుట్‌డోర్ ఫోటోగ్రఫీ ఉన్నప్పుడల్లా శ్రవణ్‌ కూడా అతనితో పాటే వెళ్లేవాడు. అంతేగాక దాదాపు ప్రతిరోజు ఎక్కువ సమయం రాజీవ్ ప్లాటులోనే ఉండేవాడు శ్రవణ్. అంతేగాక వీళ్ళ ముగ్గురి మధ్య పెరిగిన ఫ్రెండ్‌షిప్‌తో శిరీష, రాజీవ్, శ్రవణ్ ముగ్గురు కలిసి పార్టీలు చేసుకునేవారు.

అంతేగాక కొన్నిసార్లు రాజీవ్, శిరీషలను కూడా బ్లాక్‌మెయిల్ చేసేందుకు కూడా ప్రయత్నించాడనే టాక్ వినిపిస్తోంది. రాజీవ్ దగ్గర డబ్బు గుంజేందుకు పలుమార్లు ప్రయత్నాలు జరిపాడని, అమ్మాయిలను అధికారులు, ప్రముఖులకు ఎరగా వేసి తన పనులను చేయించుకుంటాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులోభాగంగానే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి ముందు నుంచి కాల్ గర్ల్స్‌ను సరఫరా చేసే శ్రవణ్ ఈనెల 12తేదీ రోజున కూడా ఉద్దేశపూర్వకంగానే శిరీషను అతని వద్దకు తీసుకెళ్లాలనుకున్నాడు.

See Also: చిక్కుముడి వీడిన ‘డెత్ సీక్రెట్స్’

రాజీవ్ ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం శిరీష, రాజీవ్‌ను 12తేదీ రాత్రి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళేలా ప్లాన్ చేశాడు. అప్పటికే చాలా టెన్షన్‌లో ఉన్న రాజీవ్, శిరీషలు ఎస్‌ఐ దగ్గరికి వెళ్తే తమకున్న ఇబ్బందులు దూరమవుతాయనే అనుకున్నారు తప్ప శ్రవణ్ ఇలాంటి ప్లాన్ వేసుకున్నాడని ఊహించలేకపోయారు. కుకునూర్ పల్లికి చేరుకున్న తర్వాత.. శిరీష, ప్రభాకర్ రెడ్డి, శ్రావణ్ ముగ్గురు కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ క్రమంలో శిరీషతో ప్రభాకర్ రెడ్డి ఏకాంతంగా గడపాలన్న ఉద్దేశంతోనే శ్రావణ్ పదేపదే సిగరెట్ పేరుతో రాజీవ్ ను బయటకు తీసుకెళ్లాడు.

అయితే తాము వచ్చిన పనికి అక్కడ జరుగుతున్న సంఘటనలు విరుద్ధంగా ఉండడంతో భయపడ్డ శిరీష కేకలు వేయడంతో రాజీవ్, శ్రవణ్‌లు లోపలికెళ్లారు. శిరీష ఎదురు తిరుగుతుందని ఊహించని శ్రవణ్ ఒక్కసారిగా కంగు తిన్నాడు.  అప్పటికే కేకలు వేస్తున్న శిరీషను సముదాయించాలని ప్రభాకర్‌రెడ్డి చెప్పడంతో భయపడుతూ అరుస్తున్న శిరీషను ఇదంతా తెలియని రాజీవ్  చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడ్నుంచి శిరీషను తీసుకెళ్లాలని ప్రభాకర్‌‌రెడ్డి వాళ్ళకు చెప్పడంతో అక్కడ్నుంచి  అర్ధరాత్రి రాజీవ్, శిరీష, శ్రవణ్‌లు బయల్దేరారు. అయితే హైదరాబాద్‌కు బయలుదేరిన తర్వాత కారులో కూడా తన ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో కోపంతో శిరీషపై దాడి చేశాడు శ్రవణ్.

See Also: హత్యను ఆత్మహత్యగా సృష్టించారా??

అయితే శిరీష, రాజీవ్‌ల విషయాన్ని సెటిల్ చేయాలనుకుంటే  హైదరాబాద్ నుంచి కుకునూరుపల్లికి అంత రాత్రిపూట తీసుకెళ్లాల్సిన అవసరం శ్రవణ్‌కు ఏముందనే పోలీసుల ప్రశ్నకు ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు. శ్రవణ్‌ ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి శిరీషను తీసుకెళ్లాడని పోలీసులు గుర్తించిన కారణంగానే అతడ్ని మొదటి నిందుడిగా పేర్కొన్నారు.

అసలు కుకునూర్‌పల్లికి అర్ధరాత్రి వెళ్లడంలో శ్రవణ్ పాత్రే కీలకమని పోలీసులు నిర్దారించారు. మరోవైపు తను ప్రేమిస్తున్న రాజీవ్ సమక్షంలో ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించడంతో తట్టుకోలేకపోయిన శిరీష హైదరాబాద్ వచ్చిన తర్వాత తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇప్పటివరకు ఎన్నో విషయాలు జరిగినా ఇలాంటిది బయటకి ఏదీ రాని ప్రభాకర్‌రెడ్డి శిరీష ఆత్మహత్య కేసులో తన పేరు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

మొత్తానికి రాజకీయాల ద్వారా  రాష్ట్రంలో అందరికీ తెలిసేలా ఎదగాలనుకున్న శ్రవణ్ చివరికి ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో ప్రథమ ముద్దాయిగా అందరికీ పరిచయం అయ్యాడు.

See Also: నమ్మలేని నిజాలు ‘కావాలనే’ బయట పెట్టారా?? అసలేం జరిగింది??

See Also: భగవద్గీత చావుమేళమా??

Have something to add? Share it in the comments

Your email address will not be published.