సీసీ ఫుటేజ్ సంగతేంటి???

Sirisha Death Why Police is not much interested in CC footage

సంచలనానికి తెరలేపిన రెండు అనుమానాస్పద మృతుల్లో బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యగా తేల్చి కేసులో విచారణను పక్కనబెట్టిన పోలీసులు కావాలనే తొందరగా పూర్తిచేసారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. శిరీష నిజంగానే ఆత్మహత్య చేసుకుందని చెబుతున్న పోలీసులు కేవలం నిందితులుగా ఉన్న రాజీవ్, శ్రావణ్‌ల వాగ్మూలాన్ని కీలకమని ఎందుకు భావిస్తున్నారు.

Sirisha Death Why Police is not much interested in CC footage

ఒక వ్యక్తిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే పనిలో భాగంగా కట్టుకథలు చెప్పే అవకాశాలు ఏమాత్రంలేవా అనే అనుమానాలు వస్తున్నాయి.  ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత ఆమె వ్యక్తిత్వాన్నే కించపరిచేలా పోలీసులు వ్యవహరిస్తున్నారనే భావన అందరిలోనూ ఉంది. అంతేగాక ఏ చిన్న కేసులో అయినా పోలీసులు కీలకంగా భావించే సీసీటీవీ కెమరాల ఫుటేజీని ఎందుకు బయటపెట్టట్లేదనే అనుమానం వ్యక్తమౌతోంది.

శిరీష అనుమానాస్పద మృతిలో కుటుంబాన్ని వదిలి ఇంకొకరితో అతి సన్నిహితంగా ఉండడమే ఆమె చావుకి కారణమని, ఆమె చావు ఒక ఎస్‌ఐ ఆత్మహత్యకు కూడా కారణయని ఈ కేసులో  అంతా అయిపోయిందని పోలీసులు చెబుతున్నప్పటికీ చనిపోయిన శిరీష, ప్రభాకర్‌రెడ్డిల బంధువులు మాత్రం ఇద్దరి చావులని పోలీసులు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

See Also: చిక్కుముడి వీడిన ‘డెత్ సీక్రెట్స్’

శిరీష బంధువులు ముఖ్యంగా ఆమెది ఆత్మహత్య అని చెబుతున్నప్పటికీ కేసులో ప్రధాన నిందితుడైన రాజీవ్‌ను రెండో నిందితుడిగా చూపించడం, శ్రవణ్‌ అనే వ్యక్తిని మొదటి నిందితుడిగా చూపించడాన్ని బట్టి విచారణలో నిజాయితీలేదని చెబుతున్నారు. అంతేగాక గొడవకు కారణమైన తేజస్వినిని కేసునుండి తప్పించడాన్ని చూస్తే పోలీసులు కేసును కావాలనే నీరుగార్చుతున్నారని అంటున్నారు. ఫ్యానుకి ఉరి వేసుకుంటే మనిషి బరువుకి రెక్కలు కనీసం వంగి ఉండాలి.. అంతేగాక ఉరి వేసుకున్నప్పుడు ఎవరికైనా ప్రాణంపోయే సమయంలో మూత్రం వస్తుందని, అలాంటివి ఏవీ పోలీసులు ఎందుకు కనిపించట్లేదని ప్రశ్నిస్తున్నారు.

ఎక్కడో హత్య చేసి తెచ్చి స్టూడియోలో ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారని మండిపడుతున్నారు. శిరీష వీపు భాగంలో రక్తపు మరకలు ఉన్నాయేంటని అడిగితే పోలీసులు సరైన సమాధానం చెప్పలేదన్నారు. అంతకుముందే ఆ స్ట్రెచర్‌పై మరో మృతదేహాన్ని తీసుకెళ్లడంతో ఆ రక్తం అంటిందని చెప్పారని శిరీష బంధువులు ఆపోపిస్తున్నారు. అసలు ఇంతజరుగుతున్నా రాజీవ్ స్టూడియో ఉన్న అపార్ట్‌మెంట్ దగ్గర బయట ఉండే ఒక్క సీసీటీవీ కెమరా కూడా వీళ్ళ యాక్టివిటీని రికార్డు చేయలేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

See Also: తప్పు ఎవరిది…?

మరోవైపు కుకునూరుపల్లి పోలీసు క్వార్టర్‌లో చనిపోయిన ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డిది ఆత్మహత్య ఏమాత్రం కాదని, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే కేసుని పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రభాకర్‌రెడ్డి  చేసుకున్న తల్లి వెంకటమ్మ, భార్య రచన, సోదరుడు భాస్కర్‌రెడ్డి. ఉన్నతాధికారుల తీరువల్ల మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లుగా ప్రభాకర్‌రెడ్డి చెప్పేవారని, ఏసీపీ తరచూ డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఆ ఒత్తిడి తట్టుకోలేక.. బదిలీ చేయించుకుంటానని, కొద్దిరోజుల్లో ములుగుకు బదిలీ అవుతానంటూ ఇంట్లో చెప్పారని అంటున్నారు.

See Also: హత్యను ఆత్మహత్యగా సృష్టించారా??

అంతేగాక సంఘటన స్థలంలో ప్రభాకర్‌రెడ్డి మృతదేహం పడి ఉన్న తీరు ఎన్నో అనుమానాలు కలిగిస్తోందని, ఒకవేళ ఆయన సర్వీస్ రివాల్వర్‌తో పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుంటే కుర్చీనుండి కనీసం క్రింద పడిపోకుండా కుర్చీలో అలానే ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రభాకర్‌రెడ్డిది ఆత్మహత్య చేసుకొనే మనస్తత్వం ఏమాత్రంకాదని స్పష్టత ఇస్తున్నారు. ఇప్పటికైనా కేసుని మరింత లోతుగా విచారణ జరిపి నిజానిజాలు బయటికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.

See Also: భగవద్గీత చావుమేళమా??

Have something to add? Share it in the comments

Your email address will not be published.