హత్యా?? ఆత్మహత్యా?? బయటపడాల్సిన నిజాలెన్నో

sirisha-si-prabahakar-reddy-who-is-responsible-for-whose-death

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో గంటకో కొత్త విషయం బయటికి వస్తోంది. ఆర్జే ఫోటో స్టూడియోలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని స్టూడియో యజమాని రాజీవ్ పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆమె వంటిపై గాయాలు ఉండడంతో శిరీష మృతిపై ఆమె భర్త సతీష్‌చంద్ర అనుమానాలు వ్యక్తం చేయడంతో విచారణను మొదలుపెట్టిన పోలీసులకు అనుమానితులు రాజీవ్, అతని ఫ్రెండ్ శ్రవణ్ చెప్పిన విషయాలు కొత్త కోణాన్ని చూపించాయి.

sirisha-si-prabahakar-reddy-who-is-responsible-for-whose-death

అంతలో నిన్న మద్యాహ్నం కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతని మృతికి శిరీష ఆత్మహత్యకి ఏమైనా లింక్ ఉందా అనే విచారణ చేపట్టిన పోలీసులకు కాల్‌రికార్డుల్లో శ్రవణ్ ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ చేసినట్లు కాల్ రికార్డుల్లో బయటికొచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అయితే విచారణలో భాగంగా పోలీసులకు రాజీవ్ చెప్పిన కథనం మరిన్ని అనుమానాలకు కారణం అవుతోంది.

అసలు శిరీష ఏ విధంగా చనిపోయింది? ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక కుకునూర్‌పల్లి పోలీసు క్వార్టర్స్‌లో రాజీవ్ కొట్టిన దెబ్బలకు చనిపోయిందా? అనే విషయంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అంతేగాక ఒకవేళ కుకునూర్‌‌పల్లి పోలీసు క్వార్టర్స్‌లో రాజీవ్ కొట్టిన దెబ్బలకు చనిపోయిన శిరీషను హైదరాబాద్ తీసుకుని వచ్చి ఆత్మహత్య డ్రామా ప్రారంభించారా? అసలు శిరీషను చంపాల్సిన అవసరం ఏమేరకు ఉందన్నదానిపై విచారణ కొనసాగుతోంది.

నిన్నటినుండి పోలీసు కస్టడీలో ఉన్న రాజీవ్, శ్రవణ్ చెబుతున్న విషయాలు ఎంతవరకు నిజమన్న విషయాలను నిర్ధారించుకోవడానికి పోలీసులు తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించి ఒకదానికి ఒకటి లింక్ ఉండడంతో సంగారెడ్డి డీఎస్పీతిరుపతన్న బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌‌కు వచ్చి అక్కడి పోలీసులను అడిగి విషయాలు తెలుసుకొని పూర్తి విచారణ కోసం రాజీవ్‌ను కుకునూరుపల్లికి తీసుకెళ్ళారు. అంతేగాక శిరీష కేసుకి సంబంధించి పోస్టుమార్టం రిపోర్టు కీలకం కానుంది.

మరోవైపు ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు సంబంధించి కూడా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శిరీష కేసుకి సంబంధించి విచారణలో రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు వేరువేరుగా విచారణ జరుపుతున్నారని మీడియాలో వచ్చిన కథనాలతో ఆ కేసులో తన పేరును ఎక్కడ బయటపెడతారనే భయంతో, ఒత్తిడివల్లే ఆత్మహత్య చేసుకున్నారా లేక ప్రభాకర్‌రెడ్డి కుటుంబం ఆరోపిస్తున్నట్లు ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు.

ఆరోజు రాత్రి ఏం జరిగింది?? రాజీవ్, శ్రవణ్‌లు పోలీసులకు చెబుతున్న వాగ్మూలంలో ఎంత నిజం ఉంది అన్నది తేలితేకానీ ఈ చిక్కుముడులు వీడేలా కనిపించట్లేదు. అసలు రాజీవ్, శిరీషలను కుకునూర్‌పల్లికి తీసుకెళ్లిన శ్రవణ్‌… శిరీష ఆత్మహత్య విషయాన్ని ప్రభాకర్‌రెడ్డికి చెప్పకుండా ఉంటారా? బుధవారం సాయంత్రం వరకు కూడా మీడియాలో ఎక్కడా రాజీవ్, శ్రవణ్, శిరీష కుకునూర్‌పల్లికి వెళ్లినట్లు రాలేదు? మరి ఏ కారణంతో ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుంటారు? శిరీష కేసుకు సంబంధించి తాము ప్రభాకర్‌రెడ్డిని ఏ విధంగానూ సంప్రదించలేదని, అసలా విషయమే తమకు తెలియదని బంజారాహిల్స్‌ పోలీసులు చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు ఆ కేసే ఎలా కారణమవుతుంది?

మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు తన భర్తను వేధిస్తున్నందువల్లే చనిపోయాడని ప్రభాకర్‌రెడ్డి భార్య ఆరోపణల్లో వాస్తవమెంత అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.