స్మైల్ పిక్చర్స్ మొదటి సినిమా షురూ

Smile Pictures Production Number 1 Shooting started

Smile Pictures Production Number 1 Shooting started

డా.మ‌ల్లె శ్రీనివాస‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో స్మైల్‌పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అర్ధ‌నారి ఫేమ్ అర్జున్, భ‌ర‌త్‌, పావ‌ని, సీమ‌చౌద‌రి తారాగ‌ణంగా రూపొందుతోన్న ప్రొడ‌క్ష‌న్ నెం.1 చిత్రం ఆదివారం హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. ఎన్‌.రామ‌స్వామి ద‌ర్శ‌క‌త్వంలో వ‌బ్బిన వెంక‌ట‌రావు సినిమాను నిర్మిస్తున్నారు. ముహుర్త‌పు స‌న్నివేశానికి అలీ క్లాప్ ఇవ్వ‌గా, కెమెరా స్విచ్ఛాన్ ను ఈటీవీ బాపినీడు చేశారు. తొలి సన్నివేశానికి తనికెళ్ళ భ‌ర‌ణి గౌరవ దర్శకత్వం వహించారు.

ద‌ర్శ‌కుడు ఎన్‌.రామ‌స్వామి మాట్లాడుతూ `ప్రేమ కంటే ప్ర‌తి మ‌నిషికి ల‌క్ష్య‌మే ముఖ్యం. ఇదే కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్ర‌మే ఇది. మంచి టీం కుదిరింది. అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమాను తెర‌కెక్కిస్తున్నాం“ అన్నారు.

హీరో అర్జున్ మాట్లాడుతూ `పోలీస్ ఆఫీస‌ర్ కావాల‌నుకునే యువ‌కుడి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. డైరెక్ట‌ర్‌గారు ఎంట‌ర్‌టైనింగ్‌ను మిక్స్ చేసి క‌థ‌ను బాగా రాశారు. అర్ధ‌నారి త‌ర్వాత నాకు ఈ సినిమాతో మ‌రోసారి మంచి గుర్తింపు వ‌స్తుంది` అన్నారు.

నిర్మాత వ‌బ్బిన వెంక‌ట‌రావు మాట్లాడుతూ `మే నెల మొద‌టి వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చింది. అర్జున్ మంచి రోల్ చేస్తున్నారు. మా బ్యాన‌ర్‌లో వ‌స్తున్న తొలి చిత్రంతో మంచి విజ‌యాన్ని సాధిస్తామ‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం“ అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.