గుండుతో సోనూ రెడీ…. అయినా పదిలక్షల ఇవ్వరంట??

Sonu Nigam shaves head in response to azaan controversy but Bengal cleric says he won’t get Rs 10 lakh

Sonu Nigam shaves head in response to azaan controversy but Bengal cleric says he won’t get Rs 10 lakh

ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూనిగమ్ ట్విట్టర్‌లో చేసిన కామెంట్ల తర్వాత రేగిన దుమారానికి ఆయనే తెరదింపారు. సోనూ తన ట్విట్టర్‌లో ‘అందరినీ దేవుడు చల్లగా చూడాలి. నేను ముస్లింని కాను. అయినా ఉదయాన్నే వినిపించే ఆజాన్‌ పిలుపుతో నిద్రలేవాలి. భారతదేశంలో ఈ బలవంతపు మతతత్వం ఎప్పుడు ముగుస్తుందో… ఇస్లాం మతాన్ని మహ్మద్ ప్రవక్త స్థాపించినపుడు కరెంటు లేదు. అప్పట్లో ఇలా మైకులో ఆజాన్ వినిపించడం లాంటివి ఏమీ లేవు. ఎడిసన్‌ బల్బును కనిపెట్టిన తర్వాతే గోల ఎందుకు? మతాన్ని అనుసరించని వారిని ఉదయాన్నే ధ్వనులతో నిద్రలేపే ఆలయాలు, గురుద్వారాలను నేను నమ్మను….. ఇలా వారికి మతానికి సంబంధం లేని వారిని… ఇలా శబ్దాలతో బలవంతంగా ఎవరు నిద్రలేపినా ఇది గుండా గిరి అవుతుంది’ అని  ట్వీట్ చేసారు.

దీనిపై చాలామంది సోనూని విమర్శించారు. మరొకింతమంది అతనికి మద్దతు పలికారు. అయితే కోల్‌కతాకు చెందిన పశ్చిమ బెంగాల్‌ మైనారిటీ యునైటెడ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు సయిద్‌ షా అతిఫ్‌ అలీ ఆల్‌ ఖ్వాద్రి సోనూనిగమ్‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసి దుమారాన్ని మరింత పెద్దది చేశారు. సోనూ నిగమ్‌కు గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి ఊరేగించిన వారికి 10 లక్షల రూపాయలు బహుమతి ఇస్తానని  ఫత్వా జారీ చేశారు. సోనూకు వ్యతిరేకంగా 21వ తేదీన ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం తాను ఇంట్లోనే ఉంటానని, ఎవరైనా గుండు కొట్టించవచ్చని సవాల్ విసిరాడు. దీనికి మీడియా కూడా రావచ్చని, తాను ముస్లింలకు వ్యతిరేకమని నిరూపిస్తే, ఎక్కడికైనా వచ్చి క్షమాపణలు చెబుతానని అన్నాడు సోనూ నిగమ్. దీంతో తాను గుండు చేసుకోవడానికి రెడీగా ఉన్నానని ట్వీట్ చేసిన సోనూ నిజంగానే ఈరోజు మద్యాహ్నం రెండు గంటలకు గుండు చేయించుకొని మీడియా ముందుకు వచ్చాడు.

తనకు గుండు చేస్తే రూ. 10 లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించిన ముస్లిం మత గురువును ఉద్దేశించి… ఇపుడు వచ్చి పది లక్షలు ఇస్తావా? మీడియా ముఖంగా ప్రశ్నించారు సోనూ నిగమ్. తను సెక్యూలర్ పర్సన్ అని తను చేసిన ట్వీట్స్ మతం గురించి కాదని లౌడ్ సౌండ్ పెట్టడం గుండాగిరి అని మాత్రమే తను ఆ ట్వీట్స్ చేసానని సోనూనిగమ్ స్పష్టంచేశారు. అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది? ఎవరు ఎవరిపైన అయినా దాడి చేయొచ్చా…ఎవరు ఎవరిపైన అయినా ఫత్వా జారీ చేయొచ్చా. ఏ మతానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు తనకు ఉందని చెప్పుకొచ్చాడు సోనూ.

సోనూ ట్వీట్స్‌తో మొదలైన ఈ వివాదం మరింత పెద్దదికాకుండానే తెరదించి ఎటువంటి ఘర్షణలు జరుగకుండా ఆపారు సోనూ నిగమ్. అయితే సోనూ నిగమ్‌కు గుండు కొట్టించాలని అన్న పెద్దమనిషి మాత్రం యూ టర్న్ తీసుకున్నారు. గుండు చేసుకున్నంత మాత్రాన 10లక్షలు ఇచ్చేదిలేదని, తాము విధించిన మూడు షరతుల్లో ఇంకా రెండు పూర్తి చేయాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. చెప్పులదండ వేసుకొని దేశం మొత్తం తిరిగి వచ్చిన తర్వాతే 10లక్షలు ఇస్తామని చెప్పుకొచ్చారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.