అనంతపురంలో ‘కియా మోటర్స్’ ఏర్పాటుకు రంగం సిద్ధం

south Korean company KIA motors to establish a new plant in Ananthapuram

south Korean company KIA motors to establish a new plant in Ananthapuram

రాయలసీమలో కొత్త కార్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధమౌతోంది. దక్షిణ కొరియాకు చెందిన కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్‌లో తమ నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించి  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కియా కార్ల తయారీ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కియా మోటార్స్‌ కోసం తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడ్డప్పటికీ.. చివరకు ఈ సంస్థ ఏపీలోనే తమ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది.

దాదాపు 12 వేల కోట్ల పెట్టుబడితో అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద కియా కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఇందు కోసం 600 ఎకరాల స్థలం గుర్తించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సంస్థ  చెబుతోంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.