మే 19న వస్తోన్న “శ్రీ  రాముడింట  శ్రీ కృష్ణుడంట”

Sri Ramudinta Sri Krishnudanta Movie ready to release on May 19th
Sri Ramudinta Sri Krishnudanta Movie ready to release on May 19th
గాయ‌త్రి ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో నూత‌న న‌టీన‌టుల‌తో ద‌ర్శ‌కుడు న‌రేష్ పెంట ద‌ర్శ‌కత్వంలో కె. ఎన్‌. రావు నిర్మాత‌గా రూపోందుతున్న చిత్రం శ్రీ రాముడింట శ్రీకృష్ణుడంట. ఈ చిత్రానికి సంభందించిన ఆడియో ని ఆదిత్యా మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోని విడుదల చేశారు. ఇప్ప‌టికే విడుదల చేసిన టీజ‌ర్ కి దాదాపు మూడు ల‌క్ష‌ల వ్యూస్ దాట‌డంతో సోష‌ల్ మీడియాలో క్రేజ్ సాదించింది. అలానే ఈ చిత్రం లో శేఖ‌ర్‌, దీప్తి లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతున్నారు.
ఆడియో సూప‌ర్ హిట్ కావ‌టం తో యూనిట్ లో మరింత జోష్ వ‌చ్చింది. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలూ పూర్తిచేసుకుని మే 19న విడుద‌ల కానుంది.నిర్మాత కె.ఎన్‌.రావు గారు మాట్లాడుతూ..టైటిల్  మంచి కాన్సెప్ట్  తో వుంది. డైర‌క్ట‌ర్ న‌రేష్ పెంట చాలా ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరి తెర‌కెక్కించారు. విడుద‌ల చేసిన పోస్ట‌ర్ నుండి ఆడియో వ‌ర‌కూ అన్ని మంచి ఆద‌ర‌ణ పొందాయి. మే 19న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాము. అని అన్నారు.
నిర్మాత ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ..  చాలా  థాంక్స్. సినిమా టైటిల్ స్టోరీ స్క్రీన్  ప్లే  బాగుంటుంది. మే19న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. గ్రామీణ నేపధ్యం  లో సాగె  ఎమోషన్  స్టోరి. నేను మ్యూజిక్ డైరెక్టర్ ని. చాలా  కథలు  రాసుకున్న. కానీ  చాలా  తక్కువ  టైం లో సినిమా స్టార్ట్  చేసాం. మా ప్రొడ్యూసర్ చాలా  సపోర్ట్  చేసారు. నాకు  చాలా  మంచి టీం  దొరికింది. మా డైరెక్షన్ టీం అందరికీ స్పెషల్  థాంక్స్.ఒక   విలేజ్ కి వెళ్లి  పది  రోజులు  గడిపి  వస్తే ఎలా  ఉంటుందో  సినిమా అంత  బాగా ఉంటుంది.అని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.