ఛలో శ్రీలంక

Srilankan Airlines started new Non Stop flight from Hyderabad to Colombo

రామాయణం తెలుసుకున్న వాళ్ళు, చదివిన వాళ్ళకి ఒక్కసారైనా రావణాసురుడు పాలించిన లంకను చూడాలని కచ్చితంగా అనిపిస్తుంది. అంతేగాక ప్రస్తుతం శ్రీలంకగా ఉన్న ఆ దేశం నాలుగువైపులా సముద్రమే ఉండడంతో చూడడానికి ఎంతో చక్కగా ప్రక‌ృతి రమణీయతతో అందరినీ ఆకట్టుకుంటోంది. అలాంటి శ్రీలంకకు హైదరాబాద్‌ నుండి వెళ్ళడానికి పర్యటకులకు ఇప్పటివరకు నాన్ స్టాప్ ఫ్లైట్ అందుబాటులో లేదు. అయితే హైదరాబాద్ నుంచి విమానాన్ని ప్రారంభించాలని కొలంబో పర్యటన సమయంలో మంత్రి కేటీఆర్.. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ సీఈవోను కోరారు.

Srilankan Airlines started new Non Stop flight from Hyderabad to Colombo

దీంతో నిర్ణయం తీసుకున్న శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి కొలంబోకు నాన్-స్టాప్ విమాన సర్వీసును ఈరోజు ఉదయం ప్రారంభించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి వారానికి నాలుగు రోజులు (ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో) ఈ సర్వీసును నడుపనుంది. ఉదయం 09:50కి శంషాబాద్‌లో టేకాఫ్ అయి 01:55 గంటలపాటు ప్రయాణించి 11:45కి కొలొంబోలో ల్యాండ్ అవుతుంది. దీనికోసం శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ ఏ320 విమానాన్ని వినియోగిస్తోంది.

See Also: టార్గెట్ 2019: కెటిఆర్ ఏం చేయబోతున్నారో తెలుసా??

శ్రీలంక క్రికెటర్ జయవర్ధనే ఈ నూతన సర్వీసును శంషాబాద్‌లో ప్రారంభించారు. ఈ విమాన సర్వీసు ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయని ఆయన తెలిపారు. టూరిస్ట్ కేంద్రంగా కొనసాగుతున్న శ్రీలంకను సందర్శించే ప్రయాణికుల సంఖ్య ప్రతియేటా పెరుగుతున్నారని, ముఖ్యంగా 1,600 కిలోమీటర్ల మేర ఉన్న తీరప్రాతం భారతీయులను ఆకట్టుకుంటుందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1.52 కోట్ల మంది ఈ విమానాశ్రయం గుండా ప్రయాణించారు. అంతక్రితం ఏడాది ప్రయాణించిన వారితో పోలిస్తే 22 శాతం పెరిగారు. హైదరాబాద్ నుంచి కొలంబోకు నాన్-స్టాప్ విమాన సర్వీసు ప్రారంభించనున్నట్లు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.