ఏప్రిల్ 13 న విడుదల కానున్న ‘బాబు బాగా బిజీ’

Baabu Baaga Busy First look poster
Baabu Baaga Busy First look poster
అవసరాల శ్రీనివాస్ సినిమా అనగానే ఓ రేంజ్‌ అంచనాలు ఉండడం కామన్. ఇప్పటివరకు అవసరాల దర్శకత్వంలోనైనా, నటుడిగానైనా భిన్నమైన కథలతో విభిన్నమైన క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు ప్రేక్షకులు కోరుకునే మంచి చిత్రాలు అందించడమే ధ్యేయంగా అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా, ఈ దర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం ‘బాబు బాగా బిజీ’.
బాలీవుడ్‌లో రికార్డులమోత మోగించిన అడల్డ్ హిట్ చిత్రం హంటర్‌కి తెలుగు రీమేక్ ఇది. హిందీ చిత్రాన్ని నిర్మించిన ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థ తెలుగు చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా… హోళీ కానుకగా బాబు బాగా బిజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ… రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రమిది. హిందీలో హంటర్ సినిమా చూసినప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. ఇందులో అవసరాల శ్రీనివాస్ హీరోగా అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యాం. దర్శకుడు నవీన్ మేడారం… అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వించే చిత్రమిది. అన్ని వర్గాల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. హోళీ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నాం. మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి ఇందులో విభిన్నమైన పాత్రల్లో కనువిందు చేయబోతున్నారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన పాటలు అద్భుతంగా వచ్చాయి. సందర్భానుసారంగా వచ్చే పాటలకు తగ్గట్టుగా సురేష్ భార్గవ విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 13న బాబు బాగా బిజీ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. అని అన్నారు.
అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, రవి ప్రకాష్, తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు
ఎడిటర్ – ఎస్.బి. ఉద్దవ్,
మాటలు – మిర్చి కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, ప్రదీప్ బోద
ఛాయాగ్రహణం – సురేష్ భార్గవ
సంగీతం – సునీల్ కశ్యప్,
నిర్మాత – అభిషేక్ నామా

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – నవీన్ మేడారం

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.