‘సన్‌స్ట్రోక్’కి బలయ్యేది ఎవరో?

Stage set for induction of Chandrababu Naidu's son Nara Lokesh and 7 Ministers out from Cabinet

Stage set for induction of Chandrababu Naidu's son Nara Lokesh and 7 Ministers out from Cabinet

  • క్యాబినెట్‌నుండి  ఏడుగురు మంత్రులకు ఉద్వాసన?
  • లోకేశ్‌తో పాటు మరికొంతమందికి మంత్రివర్గంలోకి ఆహ్వానం !
  • సన్నిహితులతో చర్చలు – త్వరలోనే ప్రకటన

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్న తర్వాత మార్పులు చేర్పులపై సీరియస్‌గానే సన్నిహితులతో చర్చిస్తున్నారట. కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేశ్‌తోపాటు మరికొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకొనే పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కనీసం ఐదుగురినుండి ఏడుగురికి గుడ్‌బై చెప్పాలని డిసైడ్ అయ్యారట.

ప్రస్తుతం మంత్రిమండలిలో ఉన్న మంత్రుల పనితీరుపై గత కొంతకాలంగా రిపోర్టులు తెప్పించుకున్న చంద్రబాబు ఇప్పటికే ఎవరిని పక్కనపెట్టాలన్నదానిపై ఓ అవగాహనకు వచ్చేశారట. అందులో ముఖ్యంగా ప్రభుత్వాన్ని వివిధ సందర్భాల్లో ఇరుకునపెట్టిన మంత్రులే టార్గెట్‌గా ఆలోచన చేస్తున్నారట. దీనికితోడు మంత్రుల పనితీరు అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు ఐదుగురికి ఉద్వాసన పలకనున్నారు.

వారిలో ప్రముఖంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌ బాబు, ఎక్సైజ్‌ – బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్రల పేర్లు ఉన్నాయని వినిపిస్తున్నప్పటికీ వీరికితోడు మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి లను కూడా తప్పిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొదట్లో మున్సిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారా యణ, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, రవాణా మంత్రి సిద్ధా రాఘవరావులను కూడా తొలగించాలని భావించినప్పటికీ పార్టీపరంగా వచ్చిన ఒత్తిళ్ళకారణంగానే వాళ్ళకు ఉద్వాసన పలకడం ఆగిపోయిందని సమాచారం.

మరోవైపు మంత్రిమండలిలో కొత్త మొహాలను తీసుకోవడంపై సీరియస్‌గానే వర్కౌట్ చేస్తున్నారు చంద్రబాబు. లోకేశ్‌‌తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి కళావెంక ట్రావు, నెల్లూరు జిల్లాకు చెందిన బీదరవిచంద్ర యాదవ్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేల్లో కర్నూలుకు చెందిన భూమా అఖిల ప్రియ, చిత్తూరుకు చెందిన అమర్‌ నాధ్‌‌రెడ్డిలను మంత్రివర్గంలో తీసుకోవాలని అనుకుంటున్నారట. అంతేగాక ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్య వర్రపసాద్‌, పయ్యావుల కేశవ్‌, మాగుంట శ్రీనివాసరెడ్డిలలో ఒకరికి కూడా అవకాశం కల్పిస్తారని వినిపిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.