బాహుబలి2కి సినిమా కష్టాలు: భవిష్యత్తు కట్టప్ప చేతుల్లోనే

Still dilemma continues in Bahubali 2 release in Karnataka as statewide bandh call given by pro-Kannada organisations Rajamouli appeals to Karnataka people not stall

Still dilemma continues in Bahubali 2 release in Karnataka as statewide bandh call given by pro-Kannada organisations Rajamouli appeals to Karnataka people not stall

బాహుబలి సినిమాలో అందిరకీ ఏమైనా గుర్తుందంటే అది ఒక్క కట్టప్ప మాత్రమే ఎందుకంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న సస్పెన్స్ కంటే ఇప్పుడు బాహుబలి2 విడుదలపై నెలకొన్న సస్పెన్స్ ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా బాహుబలి2 సినిమా కష్టాలు పడుతోంది. బాహుబలి సినిమాకి వచ్చిన క్రేజ్‌తో సెకండ్ పార్ట్‌ను ఈజీగా జనాల్లోకి తీసుకెళ్ళొచ్చనే అభిప్రాయంతో ఉన్న రాజమౌళి టీం సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ప్రసవ వేదన పడుతోంది.

కన్నడిగులు సృష్టిస్తున్న కృతిమ నొప్పులనుండి తన బిడ్డ బాహుబలి2ని కాపాడి విడుదలపై నెలకొన్న సందిగ్ధతను ఎలాగైనా తొలగించాలని భావిస్తోంది చిత్ర యూనిట్. అందులోభాగంగా ‘కట్టప్ప’ సత్యరాజ్‌ కావేరీ జలాలపై కర్ణాటకకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి ఇప్పుడు కర్ణాటకలో సినిమా విడుదలపైనే నీలిమేఘాలు కమ్ముకున్నాయి.

కావేరీ జలాల విషయంలో నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యల కారణంగా ‘బాహుబలి-ది కన్‌క్లూజన్‌’ సినిమాను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. అంతేగాక బాహుబలి2 విడుదలరోజు కర్ణాటకలో బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరికలు జారీ చేశాయి. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న నేపథ్యంలో బాహుబలి 2 విడుదల సమయంలో రచ్చ చేస్తే సత్యరాజ్‌ మెట్టు దిగొచ్చి తమకు క్షమాపణలు చెబుతాడని కన్నడిగులు భావిస్తున్నారు.

వందల కోట్ల సినిమా విడుదలను అడ్డుకుంటే నష్టం భారీగానే ఉంటుందని తెలుసుకున్న కన్నడిగులు సందర్భోచితంగా తమ నింబంధనలను తెరపైకి తీసుకొచ్చారు. తమకు వ్యతిరేకంగా ప్రభుత్వ సహాయంతో ఆర్మీని తీసుకొచ్చి సినిమాను విడుదల చేసినా ఖచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టంచేస్తున్నాయి కర్ణాటక సంఘాలు.

బాహుబలి 2 విడుదలపై జరుగుతున్నడ్రామాపై దర్శకుడు రాజమౌళి ట్విటర్‌ ద్వారా కర్ణాటక ప్రజలకు కన్నడలో ఓ సందేశం ఇచ్చారు. ‘సత్యరాజ్‌గారికి సంబంధించిన వివాదం గురించి నేను, మా నిర్మాతలు మీకు ఒక స్పష్టత ఇవ్వదలిచాము. కొద్ది సంవత్సరాల క్రితం వారు చేసిన వ్యాఖ్యలు మీలో చాలా మందికి మనోవేదన కలిగించాయి. కానీ ఆ వ్యాఖ్యలకు, మాకు ఎటువంటి సంబంధం లేదు. అది కేవలం సత్యరాజ్‌గారి వ్యక్తిగత అభిప్రాయం. ఆయన ఈ కామెంట్స్‌ చేసి తొమ్మిది సంవత్సరాలు కావొస్తోంది. ఆ తర్వాత ఆయన నటించి, నిర్మించిన ఎన్నో సినిమాలు కర్ణాటకలో విడుదల అయ్యాయి. బాహుబలి-1 కూడా విడుదలైంది. వాటన్నింటినీ ఎలా ఆదరించారో బాహుబలి-2ని కూడా ఆదరించాలని కోరుతున్నాను.

సత్యరాజ్‌ గారు ఈ సినిమాకి దర్శకులు కారు, నిర్మాత కారు. ఈ సినిమాలో నటించిన నటుల్లో ఒకరు. ఈ సినిమా విడుదల ఆపేస్తే ఆయనకు వచ్చే నష్టమేమీ లేదు. ఆయన ఒక్కరు చేసిన కామెంట్స్‌ వల్ల ఇంత మందిపై ప్రభావం చూపుతుంది. వారొక్కరి మీద ఉన్న కోపాన్ని బాహుబలి సినిమాపై చూపడం సరైనది కాదని తెలియజేస్తున్నాం.

ఈ విషయం గురించి సత్యరాజ్‌ గారికి ఫోన్‌ చేసి పరిస్థితి మాట్లాడాను. అంతకుమించి ఏమీ చేయడానికి మాకు శక్తిలేదు. మాకు ఏ విధంగానూ సంబంధంలేని ఈ వ్యవహారంలో మమ్మల్ని లాగొద్దని మిమ్మల్ని అందరిని వేడుకుంటున్నాం. మీ ప్రేమ ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుతూ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం’’ అంటూ రాజమౌళి ట్విట్టర్‌లో కోరారు.

మొత్తానికి బాహుబలి 2 సినిమా విషయంలో జరుగుతున్నది కేవలం సత్యరాజ్‌పైన కోపంతోనా లేక వేరే ఏదైనా కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.