సందీప్ కిషన్ కోసం రంగంలోకి దిగిన ‘కిట్టు’ డైరెక్టర్ వంశీ, ‘నేను లోకల్’ రైటర్ ప్రసన్న

Sundeep Kishan getting ready to team up with Director Vamshi Krishna and Writer Prasanna for next project

Sundeep Kishan getting ready to team up with Director Vamshi Krishna and Writer Prasanna for next project
తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తోన్న సందీప్ కిషన్ తాజాగా మరో నూతన చిత్రానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. ‘దొంగాట’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ ఈసారి సందీప్ కిషన్ తో ఓ వైవిధ్యమైన పాత్ర చేయించేందుకు ప్లాన్ చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ఈ సినిమాకు మోస్ట్ హ్యాపెనింగ్ రైటర్ ప్రసన్నకుమార్ స్టోరీ అందిస్తున్నట్లుగా దర్శకుడు వంశీకృష్ణ ప్రకటించారు.

గతంలో ప్రసన్నకుమార్ కథ అందించిన ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ రెండు చిత్రాల మాదిరిగానే సందీప్ కిషన్ ని దృష్టిలో పెట్టుకొని ఓ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీని రెడీ చెసినట్లుగా ప్రసన్న తెలిపారు.

ఇక ఈ సినిమాను ‘సినిమా చూపిస్తా మావ’కి నిర్మాతగా వ్యహరించిన రూపేశ్ డి గోహిల్ నిర్మిస్తున్నారు. ‘ఆర్ డి జి ప్రొడక్షన్ ప్రెవైట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ‘నేను లోకల్’, ‘భలే భలే మగాడివోయ్’ సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందిందచేందుకు రెడీ అవుతున్నారు.

దీంతో పాటు ఈ సినిమాలో హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాత రూపేశ్ డి గోహిల్ తెలిపారు.
బ్యానర్ : ఆర్ డి జి ప్రొడక్షన్ ప్రెవైట్ లిమిటెడ్,  నిర్మాత : రూపేశ్ డి గోహిల్, హీరో : సందీప్ కిషన్, దర్శకుడు : వంశీకృష్ణ(దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేమ్)
రైటర్ : ప్రసన్న కుమార్ బెజవాడ(సినిమా చూపిస్తా మావ, నేనులోకల్) , సినిమాటోగ్రాఫర్ : నిజార్ షఫి

Have something to add? Share it in the comments

Your email address will not be published.