ట్వీట్ల యుద్ధం: దయలేని పాకిస్తాన్

Sushma Swaraj fires on Pakistan Minister on Kul Bhushan Mother Visa

దాయాదుల మధ్య ఎన్ని విబేధాలు ఉన్నా, కొన్ని విషయాల్లో అన్నింటిని పక్కనబెట్టి వ్యవహరించాల్సిన కనీస బాధ్యత ఇద్దరిపైనా ఉంది. ఈమధ్యకాలంలో ఇరుదేశాల్లోని జైళ్ళలో మగ్గుతున్న ఖైదీల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో బాధ్యతలను పక్కనబెట్టి వైషమ్యాలను రెచ్చగొట్టేలా చర్యలు చేస్తోంది పాకిస్తాన్. కుల్‌భూష‌ణ్ జాద‌వ్ త‌ల్లి అవంతికా జాద‌వ్‌కు వీసా ఇప్పించాల‌ని స్వ‌యంగా తానే పాకిస్థాన్‌ను కోరినా ఆ దేశం మాత్రం స్పందించ‌డం లేదు అని భారత విదేశాంగ శాఖామంత్రి సుష్మా ఆరోపించారు.

Sushma Swaraj fires on Pakistan Minister on Kul Bhushan Mother Visa

ఈరోజు ఉదయం వరుస ట్వీట్లతో అసలు జరుగుతున్న విషయాన్ని ప్రపంచానికి తెలియచేసిన సుష్మాస్వరాజ్ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి స‌ర్తాజ్ అజీజ్‌పై తీవ్రంగా మండిప‌డ్డారు. త‌న కుమారున్ని క‌ల‌వాల‌నుకుంటున్న జాదవ్ త‌ల్లికి పాక్ వీసా ఇవ్వ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. అయితే మెడిక‌ల్ వీసా కోరుకుంటున్న పాకిస్థానీల ప‌ట్ల త‌న‌కు సానుభూతి ఉంద‌ని, కానీ అదే విధంగా పాక్ స్పందించ‌డం లేద‌న్నారు. ఓ పాకిస్తానీకి మాత్రం తాను మెడిక‌ల్ వీసా ఇప్పించిన‌ట్లు ఆమె చెప్పారు.

See Also: కులభూషణ్‌ మరణశిక్షపై స్టే… పాకిస్థాన్‌కు మొట్టికాయలు

అంతేగాక పాక్ విదేశాంగ మంత్రి స‌ర్తాజ్ అజిజ్‌కు తానే వ్య‌క్తిగ‌తంగా లేఖ రాసినప్పటికీ, ఆయ‌న క‌నీసం ఆ లేఖ ప‌ట్ల స్పంద‌న ఇవ్వ‌లేక‌పోయారని మండిపడ్డారు.గ‌త ఏడాది కుల్‌భూష‌న్ జాద‌వ్‌ను పాకిస్థాన్ అరెస్టు చేసి దేశ‌ద్రోహం కేసులో పాక్ మిలిట‌రీ కోర్టు అత‌నికి మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది.

See Also: సిగ్గులేని పాకిస్తాన్ ఆర్మీ

Have something to add? Share it in the comments

Your email address will not be published.