మార్చి 29న ఉగాది రోజున ‘వెంకటాపురం’ విడుద‌ల‌

Suspense Thriller Venkatapuram Ready to release on Ugadi, March 29th
Suspense Thriller Venkatapuram Ready to release on Ugadi, March 29th
ఈరోజుల్లో లాంటి ట్రెండ్ సెట్టింగ్ సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాన్ని అందిచిన గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. హ్యాపీడేస్ ఫేం యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్‌ సాంగ్‌ను ఇటీవ‌లే స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ చిత్ర యూనిట్‌ సమక్షంలో లాంచ్ చేశారు. మెద‌టి సాంగ్ విన్న ప్ర‌తి ఒక్క‌రూ చాలా బాగుంద‌ని ప్ర‌శంశించారు. సోష‌ల్ మీడియాలో చాలా మంచి బ‌జ్ వ‌చ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వెంకటాపురం చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 29న ఉగాది సంద‌ర్బంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.
నిర్మాత‌ల్లో ఒక‌రైన శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ ‘ఈరోజుల్లో లాంటి చిత్రాన్ని అందిచిన మా గుడ్ సినిమా గ్రూప్ బ్యాన‌ర్ లో నిర్మిస్తు్న్న చిత్రం వెంకటాపురం. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌లే ప్ర‌ముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. పది లక్షలకు పైగా వ్యూస్‌ మార్క్ దాటింది. త‌రువాత స్టార్ డైర‌క్ట‌ర్ వి.వి.వినాయ‌క్ చేతుల మీదుగా విడుద‌ల చేసిన సాంగ్ కి కూడా సూప‌ర్ బ‌జ్ వ‌చ్చింది. ఆడియో కి క‌సంబందించిన అతిత్వ‌ర‌లో ఓ పెద్ద ఈవెంట్ చేస్తాము.’
‘క‌థ విష‌యానికోస్తే  ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో ఆధ్యంతం ఆసక్తి కరంగా ఆకట్టుకుంది. సరికొత్త కథాంశంలో సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. హీరో రాహుల్ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. హీరోయిన్ మ‌హిమా మ‌క్వాన్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఒ కొత్త అనుభూతిని మాత్రం ఈ చిత్రం క‌ల్పిస్తుంది. మా మెద‌టి చిత్రం ఉగాది ప‌ర్వ‌దినాన విడుద‌ల‌యిన విష‌యం తెలిసిందే.. ఇప్పుడు కాక‌తాలియంగా వెంక‌టాపురం కూడా ఉగాది ప‌ర్వ‌దినాన విడుద‌ల కావ‌టం మా అదృష్టం గా భావిస్తున్నాము. మార్చి 29న ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంద‌న‌టంలో ఏమాత్రం సందేహం లేదు.’ అని అన్నారు
అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానిక సంగీతం: అచ్చు, కెమెరా: సాయిప్రకాష్ ఆర్ట్: జె.మోహన్, కెమెరామేన్: సాయి ప్రకాష్, మ్యూజిక్: అచ్చు, ప్రొడక్షన్ కంట్రోలర్: వాసిరెడ్డిసాయిబాబు, డ్యాన్స్ మాస్టర్: అనీష్ విజ్ఞేష్, అనిత నాథ్, స‌హ‌నిర్మాత‌- ఉమాదేవి ప్రొడ్యూసర్స్: శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ , స్టోరీ, డైరెక్టర్: వేణు మాధికంటి.​

Have something to add? Share it in the comments

Your email address will not be published.