స్వచ్ఛభారత్ అంటే ఇదేనా??

Swach Bharath: Minister Radha Mohan Singh passes Urine Outside

స్వచ్ఛ భారత్ అనేది కేవలం ప్రజలకు మాత్రమే వర్తించే అంశం అన్నట్లుగా తయారైంది అధికార పార్టీ నేతలది. స్వచ్ఛభారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ కృషి చేస్తుంటే సొంత మనుషుల నుండే మద్దతు కరువైతోంది.

Swach Bharath: Minister Radha Mohan Singh passes Urine Outside

బహిరంగ మూత్ర విసర్జన చేయకూడదంటూ దేశవ్యాప్తంగా ప్రచారం జరిగి చాలా చోట్ల మూత్రశాలలు నిర్మించినప్పటికీ కొంతమంది మాత్రం విస్మరిస్తూనే ఉన్నారు. ఈసారి ఏకంగా మోడీ మంత్రివర్గంలోని సభ్యుడు, కేంద్ర వ్యవసాయశాఖామంత్రి రాధామోహన్‌‌సింగ్‌ బహిరంగ మూత్రవిసర్జన చేసి అడ్డంగా బుక్ అయ్యారు. కారు ఆపి సెక్యురిటీ గార్డుల సంరక్షణలో మూత్రవిసర్జన చేస్తూ కెమెరా కంటికి చిక్కారు.

Swach Bharath: Minister Radha Mohan Singh passes Urine Outside

ఇటీవలే బీజేపీ ఎంపీ ప్రియాంకా రావత్ సరయూ నదిలో ప్లాస్టిక్ బాటిల్ విసిరేసిన వీడియో బయటకు రావడంతో వివాదం రేగిన విషయం తెలిసిందే. ఓ వైపు స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నిస్తుంటే, సాక్షాత్తూ మంత్రులు, ఎంపీలే దీనికి విరుద్దంగా వ్యవహరిస్తుండటంతో నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేగాక ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

See Also: మీడియాపై కెటిఆర్ గరం – తెలంగాణా ఇమేజ్‌ను దెబ్బతీయకండి

Have something to add? Share it in the comments

Your email address will not be published.