కోలీవుడ్‌లో పోటాపోటీ!

Tamil Movies High Budget movies are ready to hit the screens in August

Tamil Movies High Budget movies are ready to hit the screens in August

టాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమాల హడావిడి కొనసాగుతూనే ఉంది. ఒక సినిమా తర్వాత ఒకటి విడుదలకు నోచుకుంటున్నాయి. సినిమాను ఎంత అద్భుతంగా తీసినా దాన్ని సరైన సమయంలో విడుదల చేసుకోలేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఎన్నో సినిమాలు మనముందు అట్టర్ ఫ్లాఫ్ అయి కనిపించాయి.

అందుకే నిర్మాతలు చాలామంది ఆలస్యం అయినప్పటికీ సరైన టైం కోసం ఎదురుచూస్తూ సినిమాలను విడుదల ఆపుకుంటున్నారు. కరెక్ట్ టైం వచ్చిన తర్వాత  ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకే మొగ్గుచూపిస్తున్నారు. గత రెండేళ్ళుగా తెలుగులో సంక్రాంతి, దసరా, దీపావళి టైంలో ఒకేసారి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయి హిట్ కొడుతున్నాయి.

ఈ యేడాది కూడా తెలుగుతో పాటు అటు తమిళంలోనూ సేమ్ అలాంటి పరిస్థితి ఎదురౌతోంది. అజిత్‌ కథానాయకుడిగా ప్రస్తుతం ‘వివేగం’ సినిమా రూపొందుతోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తుండడంతో మంచి కలెక్షన్లు వస్తాయని నిర్మాతలు అనుకుంటున్నారు.

ఇక మరోవైపు విశాల్‌ కథానాయకుడిగా మిస్కిన్‌ దర్శకుడుగా ‘తుప్పారివలన్‌’ తెరకెక్కుతోంది. ఈ టీం కూడా ఆగస్టు 11న విడుదల చేయాలని అనకుంటున్నారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంటుందని భావిస్తున్నారు. దీనికితోడు తమిళ దర్శకుడు మురుగదాస్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో ‘స్పైడర్‌’ రూపొందిస్తున్నారు. దీన్ని తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో మహేశ్‌ తమిళ పరిశ్రమకి పరిచయం కానున్నారు. ఈ సినిమాను కూడా ఆగస్టు 11న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొత్తానికి ఈ యేడాది స్వాతంత్య్రదినోత్సవం పెద్ద సినిమాలు విడుదల అవుతుండడంతో సినీ ప్రేమికులకు మజా ఫుల్‌గా వచ్చేట్లు కనిపిస్తున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.