రైతుల కోసం తమిళనాడు బంద్

Tamil Nadu Bandh continues Today, Government Says Normalcy Will Not Be Affected

Tamil Nadu Bandh continues Today, Government Says Normalcy Will Not Be Affected

గత కొన్ని రోజులుగా డిమాండ్లు తీర్చాలని ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతుగా డీఎంకె సహా ప్రతిపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్‌ తమిళనాడులో జరుగుతోంది. తమిళనాడు వర్తకుల సమాఖ్య, వ్యాపారుల సమాఖ్య, రవాణా కార్మికుల సంఘాలు,కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, లారీలు నిలిచిపోయాయి. 10వేల పెద్ద, చిన్న హోటళ్లు మూతపడ్డాయి.

పౌరసరఫరాలు, ప్రజా రవాణా దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆర్టీసీ బస్సులను ప్రతిపక్షాలు అడ్డుకుంటాయన్న కారణంతో భారీ బందోబస్తు నడుమ వాటిని తిప్పుతున్నారు. బస్టాండ్లలోనూ భారీ భద్రత ఏర్పాటుచేశారు. చెన్నైలో 13వేల మంది.. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. దీన్ని అఖిలపక్ష బంద్‌గా ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, మరికొన్ని పార్టీలు బంద్‌కు మద్దతు ఇవ్వడం లేదు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.