తమిళనాడు రాజకీయాలు: పాత మిత్రులు ఒక్కటౌతారా?? ముఖ్యమంత్రి పీఠం ఎవరిది??

Tamil Nadu Politics OPS and EPS want the CM chair Three factions in AIADMK now Will state see snap polls

Tamil Nadu Politics OPS and EPS want the CM chair Three factions in AIADMK now Will state see snap polls

అన్నాడీఎంకేలో గ్రూపులను పక్కనబెట్టి పాతమిత్రులు కలిసిపోతారా??? పార్టీలో కుటుంబపాలన కొనసాగిస్తున్న చిన్నమ్మ శశికళను గెంటేసిన ముఖ్యమంత్రి పళని స్వామి పన్నీర్‌ను తనతో కలుపుకుంటారా?? లేక చిన్నమ్మను పక్కనపెట్టడానికి పన్నీర్ సెల్వం విధించిన ఆంక్షలను పావులుగా వాడుకొని పన్నీర్‌ను మరోసారి బకరాను చేయనున్నారా??? ముఖ్యమంత్రి పదవిని వదులుకొని మరీ పన్నీర్‌తో పళని స్వామి దోస్తీ చేస్తారా?? ప్రభుత్వం మళ్ళీ విశ్వాసపరీక్ష దిశగా అడుగులు వేస్తోందా?? తమిళనాడులో ఎన్నికలకు రంగం సిద్ధమౌతోందా?? తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదైనా జరగొచ్చనే అనిపిస్తోంది.

ఎందుకంటే తమిళనాడులో టీటీవీ దినకరన్‌పై 50 లక్షలు లంచం ఇవ్వజూపారన్నకేసు నమోదు అయిన తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. అన్నాడీఎంకే తిరిగి ఏకమయ్యేందుకు శశికళ వర్గానికి చెందిన నాయకగణం ముందుకు వస్తే తాను స్వాగతిస్తానని చెప్పిన పన్నీర్ సెల్వం డిమాండ్‌ను పరిగణలోకి తీసుకొని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై చెన్నై సచివాలయంలో రెండుసార్లు సీఎం పళనిస్వామితో భేటీ అయ్యారు. పళనిస్వామితో జరిగిన సుదీర్ఘ మంతనాల తర్వాత ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరిందని పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అందులో భాగంగా అన్నాడీఎంకే నుంచి శశికళ, టీటీవీ దినకరన్‌‌లను పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖా మంత్రి జయకుమార్‌ ప్రకటించారు. అయితే పార్టీని నడిపించేందుకు కమిటీ ఏర్పాటవుతుందని, అందరి ఏకాభిప్రాయం మేరకే నిర్ణయం జరిగిందన్నారు.

20 ministers decided to throw sasikala and Dinakaran out of aiadmk panel to work on ops eps merger

మరోవైపు శశికల, దినకరన్‌లను పార్టీనుండి బహిష్కరించిన తర్వాత చెన్నైలో దినకరన్‌తో 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం కావ‌డం ప్రాధాన్యం సంతరించుకుంది. శాసనసభ్యులతో చర్చించకుండానే మంత్రి జయకుమార్‌ నిర్ణయం తీసుకున్నారని దినకరన్‌ మద్దతుదారలు ఆరోపిస్తున్నారు. అయితే  ఇప్పటికి కూడా దినకరన్ గ్రూప్‌లో 25మంది ఎమ్మెల్యేలు ఉన్నారని దినకరన్ గ్రూప్ చెబుతోంది.

అయితే ఇక్కడివరకు అంతా ప్లాన్ ప్రకారమే శశికళను బయటికి పంపించిన పళనిస్వామి ఇప్పుడు అసలు పన్నీర్‌సెల్వం గ్రూప్‌ను విలీనం చేసుకుంటారా అన్నదే తేలాల్సిన అసలు ప్రశ్న. ఎందుకంటే మంత్రులు అయితే శశికళను పార్టీనుండి బయటికి పంపించామని చేసిన ప్రకటనలో ఎక్కడా రెండు గ్రూపుల మధ్య చర్చలు జరుగుతున్న విషయాలు కానీ రెండు వర్గాలు విలీనం అవుతున్నాయని కానీ ఎక్కడా చెప్పలేదు. దీనిన బట్టి చూస్తుంటే రాష్ట్రంలో ఎఐఎడిఎంకెలో ఇప్పటికి ఉన్న పన్నీర్ సెల్వం వర్గం, శశికళ వర్గాలకు పోటీగా మరో కొత్త వర్గం పుట్టుకొచ్చిందనే అనిపిస్తోంది. అదే పళనిస్వామి వర్గం.

విలీనానికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సయోధ్య కుదరలేదనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరికీ ముఖ్యమంత్రి పదవిపై ఉన్న ఆశతో ఒకవేళ విలీనం జరిగితే ఆ పదివి స్వీకరిస్తారన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. పళనిస్వామి శశికళను పార్టీనుండి గెంటేయడం ద్వారా ఇప్పటికైతే తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని, అయితే అది ఒక్కటే సరిపోదని పన్నీర్ సెల్వాన్ని తర్వాతి ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నప్పుడే విలీనం జరుగుతుందని పన్నీర్ సెల్వం వర్గం భావిస్తోంది.

paneer selvam

ఒకవేళ పళనిస్వామి పన్నీర్‌సెల్వాన్ని ముఖ్యమంత్రిని చేయడానికి ఒప్పుకోని పక్షంలో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పళనిస్వామి లెక్కలప్రకారం తనకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అనుకుంటున్నారు. అందులో ఇప్పుడు శశికళను పార్టీ నుండి గెంటేసిన తర్వాత సుమారు 10 మంది ఎమ్మెల్యేలు దినకరన్‌తో భేటీ అయ్యారు. అంటే లెక్క 112 మందికి వస్తుంది. అలాంటప్పుడు రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్నికలు రావొచ్చనిపిస్తోంది.

ఒకవేళ పన్నీర్ సెల్వం వర్గాన్ని విలీనం చేసుకోకుండా ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలని పళనిస్వామి ఆలోచిస్తే మాత్రం పెద్ద తప్పవుతుంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా జయలలిత చనిపోయిన సీటు, స్పీకర్ ధనపాల్‌ల సీట్లను పక్కనబెడితే లెక్క 232కి వస్తుంది. అంతేగాక గత కొంతకాంలగా అనారోగ్యంతో ఉండడం వల్ల డిఎంకె ఛీఫ్ కరుణానిధి బలనిరూపణకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో అసెంబ్లీలో బలనిరూపణలో పాల్గొనే ఎమ్మెల్యేల సంఖ్య 231కి వచ్చి చేరింది.

ఇందులో గట్టెక్కాలంటే సభ్యుల సంఖ్యలో సగం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. ఎఐఎడిఎంకెలోని అన్ని గ్రూపులను కలుపుకొని 132మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 11మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వర్గంలో ఉన్నారు. పళనిస్వామి వర్గంలో స్పీకర్ ధనపాల్‌తో కలసి 122మంది ఉన్నారు. అందులో శశికళ, దినకరన్‌లను పార్టీనుండి బహిష్కరించిన తర్వాత దినకరన్‌తో భేటీ అయిన ఎమ్మెల్యేలను ఒకవేళ దినకరన్‌ తనలో ఉంచుకోగలిగితే అప్పుడు పళనిస్వామి వర్గానికి కొత్త చిక్కులు తప్పేలా లేవు. ఎందుకంటే బలనిరూపణకి అవసరమైన సంఖ్యకి ఐదుగురు ఎమ్మెల్యేలు తక్కువ అవుతారు. పన్నీర్ సెల్వం వర్గాన్ని విలీనం చేసుకోకుండా పళనిస్వామి తన ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవాలని అనుకుంటే మాత్రం  దినకరన్‌ వెంట ఉన్న పదిమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం తప్ప చేయగలిగే వేరే ఎత్తుగడ ఏదీలేదు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.