ప్రధాని కార్యాలయం ఎదుట నగ్నంగా ఆందోళన

TamilNadu farmers strip outside PMO in protest demand relief package and against farmers suicide
TamilNadu farmers strip outside PMO in protest demand relief package and against farmers suicide

ఢిల్లీ పురవీధుల్లో తమిళ తంబిలు తమ గోడును వినూత్నంగా వినిపించే ప్రయత్నం చేశారు. గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న తమిళ రైతులు ఈరోజు ఎంతో కట్టుదిట్టమైన భద్రతలో ఉండే ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర సౌత్ బ్లాక్ ముందు నగ్నంగా తమ ఆందోళనను చేపట్టారు. కరువు ఉపశమన ప్యాకేజీని మంజూరు చేయాలని గత కొన్ని రోజులుగా జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలుపుతున్న తమిళ రైతులు రుణమాఫీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు.

పుర్రెలు, ఎముకలను ధరించి ఆందోళన చేపట్టి అందరి ద‌‌ృష్టిని ఆకర్షించిన రైతులు తమ ఆక్రందన వినిపించేందకు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేగాక డిమాండ్లను కేంద్రం ఒకవేళ నెరవేర్చకపోతే గొంతుకోసుకొని చచ్చిపోవడానికైనా రెడీగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించిన అమిళ అన్నదాతల ఆందోళన నేపథ్యంలో కరువు తుఫాను సహాయం క్రింద సుమారు 2వేల కోట్లసాయాన్ని కేంద్రం ప్రకటించింది.

మరోవైపు తమిళ రైతులకు మద్దతుగా తమిళ నటులు ముందుకు వచ్చి మద్దతు తెలపడేకాకుండా తాజాగా తమిళ నిర్మాతల మండలి తరుపున అధ్యక్షుడు హీరో విశాల్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇకనుండి తమిళనాడులో విడుదలయ్యే ప్రతీ సినిమా టికెట్‌లో ఒక రూపాయి రైతుల సంక్షేమానికి వెళ్తుందని చెప్పుకొచ్చాడు. అయితే తమిళ రైతులు మాత్రం తమ ఆందోళనను ఢిల్లీలో మరింత తీవ్రతరం చేయాలని అనుకుంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.