అవార్డులు రాకపోవడానికి కారణం ఇదే: తాప్సీ

Tapsee reveals the secret behind getting awards in Film Industry

Tapsee reveals the secret behind getting awards in Film Industry

చలన చిత్ర పరిశ్రమలో ఇచ్చే అవార్డుల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఒకసారి కొన్ని చిత్రాలకు అవార్డులు ఇవ్వడంపై వివాదం చెలరేగితే, అసలు ఏమాత్రం ప్రజాదరణ పొందని చిత్రాల్లో నటించిన వారికి అవార్డులురావడంపై మరికొన్ని వివాదాలు జరుగుతాయి. అందుకే చలన చిత్ర పరిశ్రమలో ఎవరికి నచ్చిన విధంగా అవార్డులను ఇచ్చే పరంపర కొనసాగుతోంది.

అవార్డులు ఇచ్చేరోజు సదరు హీరో కానీ, హీరోయిన్‌కానీ ఫంక్షన్‌కు వస్తారా లేదా అన్నదానిపై అవార్డులను ఇవ్వడం ఆధారపడి ఉంటుంది. పిలిచినప్పుడు అవార్డుల ఫంక్షన్లకు వచ్చేవారి సినిమా ఏమాత్రం విజయంసాధించకపోయినా ఆ సినిమాకు అవార్డులు కుప్పలుతెప్పలుగా ఇస్తుంటారు. అంతేగాక ఫిల్మ్ సర్కిళ్ళలో మెయింటైన్ అవుతున్న గ్రూపుల్లో యాక్టివ్‌గా ఉండేవారికే ఎక్కువ ఛాన్స్ ఉంటాయనేది ఎవ్వరికీ తెలియని విషయం.

ఇప్పుడు అదే విషయాన్ని హీరోయిన్ తాప్సీ చెప్పుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఎంతో చర్చకు తెరలేపిన పింక్ సినిమాకు జాతీయఅవార్డుల్లో సినిమాకు అవార్డు వచ్చినప్పటికీ విమర్శకుల ప్రశంసలను అందుకున్న తాప్సీకి మాత్రం రాలేదు. ఇదే విషయాన్ని తాప్సీ దగ్గర ప్రస్తావిస్తే చాలా వైల్డ్‌గా రియాక్ట్ అయ్యింది.

అవార్డులు రాకపోవడం తనకి కొత్త విషయం ఏమీ కాదని, సౌత్‌లో తను నటించిన చాలా సినిమాలకు అవార్డులు వస్తాయని మొదట్లో భావించానని, అయితే మొదటి సినిమాకు తప్ప వేరే ఏ ఇతర సినిమాలకు అవార్డులు రాలేదని చెప్పుకొచ్చింది. అంతేగాక అవార్డులు రావాలంటే స్పెషల్‌గా ఇండస్ట్రీలో ఉన్న స్పెషల్ గ్రూపుల్లో యాక్టివ్‌గా ఉన్నప్పుడే ఇస్తారనే విషయం తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది తాప్సీ.

Have something to add? Share it in the comments

Your email address will not be published.