టార్గెట్ 2019: పోలవరం పూర్తికావడం కొన్ని పార్టీలకు ఇష్టంలేదు: చంద్రబాబు

Target 2019 AP CM Chandrababu Naidu reviews progress of Polavaram project and its spillway works with officials

Target 2019 AP CM Chandrababu Naidu reviews progress of Polavaram project and its spillway works with officials

టార్గెట్ 2019 దిశలో పనులు మొదలుపెట్టారు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈమధ్య ఆయన ఏ పనిచేసినా రాబోయే ఎన్నికలనెు ద‌ృష్టిలో పెట్టుకొనే చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయం. పోలవరం ప్రాజెక్టు పనులు మొదలైనప్పటినుండి సమీక్షలు జరుపుతున్న చంద్రబాబు ఈరోజు మరోసారి పోలవరం ప్రాజెక్ట్ పనులపై దృష్టి పెట్టారు. అందులోభాగంగా ఈరోజు మంత్రులు పితాని సత్యనారాయణ, జవహర్‌నాయుడుతో కలిసి మండుటెండలో పోలవరం స్పిల్ వే పనులను చంద్రబాబు పరిశీలించారు. ఆ తర్వాత  పోలవరం పనుల ప్రగతిపై అధికారులకు సూచనలు చేశారు.

అనంతరం జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో చంద్రబాబు పోలవరం ప్రాజెకట్ు పనులపై సమీక్ష నిర్వహిచారు. 2019 లక్ష్యంగా పనిచేయాలని సూచిస్తూనే, పనులను వేగంగా పూర్తిచేయాలని  సూచించారు చంద్రబాబు. అయితే పోలవరం పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందన్నారు. మొత్తం 48 గేట్ల నిర్మాణం జరగాల్సి ఉండగా ప్రస్తుతం 5 గేట్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం సుమారు 4వేల మంది శ్రామికులతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చంద్రబాబు తెలిపారు.

అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తికావడానికి కొన్ని పార్టీలకు ఇష్టంలేదని అందుకే కొందరు స్వార్థ రాజకీయ నేతలు కోర్టులకు వెళ్లి పోలవరం పనులను అడుగడుగునా అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు అధికారులకు కూడా చురకలంటించారు చంద్రబాబు. ఏదైనా పని అయితే మీ గొప్ప.. పని కాకుంటే ఇతరుల తప్పు అన్నట్టుగా వ్యవహరించొద్దని అధికారులకు చంద్రబాబు సూచించారు. వచ్చే వారం పోలవరంపై ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తామని తెలిపిన చంద్రబాబు ఒక్కరోజు పని ఆగిపోతే 21కోట్ల రూపాయల నష్టం వస్తోందని స్పష్టంచేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.